Fungus On Bhadrachalam Laddu : 10టీవీ ఎఫెక్ట్.. భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూల విక్ర‌యంపై స్పందించిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూ విక్ర‌యాలపై 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. బూజు పట్టిన లడ్డూల కథనాలను చూసిన స్థానిక జడ్జి ఆలయానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ లడ్డూ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు.

Fungus On Bhadrachalam Laddu : 10టీవీ ఎఫెక్ట్.. భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూల విక్ర‌యంపై స్పందించిన అధికారులు

Fungus On Bhadrachalam Laddu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూ విక్ర‌యాలపై 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. బూజు పట్టిన లడ్డూల కథనాలను చూసిన స్థానిక జడ్జి ఆలయానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ లడ్డూ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు.

జాయింట్ కలెక్టర్ ఆదేశాలను ఆలయానికి వెళ్లిన పోలీసులను ఆలయ సిబ్బంది, అర్చకులు అడ్డుకున్నారు. లడ్డూ ప్రసాదాలు సరిగానే ఉన్నాయన్నారు. పోలీసులను అడ్డుకున్న ఆలయ అధికారులపై భక్తులు మండిపడ్డారు. ఇంకా తమ చేతిలోనే బూజు పట్టిన లడ్డూలు ఉన్నాయని, అయినా ఆలయ సిబ్బంది బుకాయించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read..Bhadrachalam: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం.. అధికారులపై భక్తుల ఆగ్రహం

పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే ఆలయ సిబ్బంది పోలీసులను అడ్డుకున్న నేపథ్యంలో అక్కడే ఉన్న భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాగా, లడ్డూలకు ఎలాంటి బూజు పట్టలేదని ఆలయ సిబ్బంది వాదించారు. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

బూజు పట్టిన లడ్డూలపై జాయింట్ కలెక్టర్ కు జడ్జి ఫిర్యాదు చేశారు. బూజు పట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయిస్తున్నారనే వార్త తెలియగానే వెంటనే 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలను చూసిన స్థానిక జడ్జి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వెళ్లారు. భక్తుల చేతిలో ఉన్న బూజు పట్టిన లడ్డూలను చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన దీనిపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు.

Also Read..Tirumala Laddu Prasadam Weight : తిరుమల లడ్డూ బరువు వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భద్రాచలం సీతారాముల ఆలయం ఒకటి. అయితే ఎంతో పవిత్రంగా భావించే స్వామి వారి ప్రసాదం నాణ్యతలో లోపం కనిపించింది. శ్రీరాముడి సన్నిధిలో పాచిపోయిన లడ్డూలు, బూజు పట్టిన లడ్డూలు విక్రయించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. లడ్డూలు పాచి పోయి ఉన్నాయి. పైగా బూజు పట్టి ఉన్నాయి. ఇది స్పష్టంగా తెలుస్తుంది. అయినా, ఆలయ సిబ్బంది ఆ లడ్డూలనే విక్రయించడం దారుణం అంటున్నారు భక్తులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అసలేం జరిగిందంటే..
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు కోసం దాదాపు 2 లక్షల లడ్డూలను భద్రాచలం ఆలయ సిబ్బంది తయారు చేసింది. భక్తులకు పంపిణీ చేయగా మిగిలిపోయిన లడ్డూలను సరిగా భద్రపరచలేదు. దీంతో ఆ లడ్డూలు ఫంగస్, బూజు పట్టాయి. వాటినే భక్తులకు ప్రసాదంగా విక్రయించారు సిబ్బంది. దీనిపై ఆగ్రహించిన భక్తులు లడ్డూల కౌంటర్ వద్ద… ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును అని రాసి నోటీసు సైతం అంటించారు. ఈ నోటీసు ఆలయం ప్రసాదం కౌంటర్ వద్ద కలకలం రేపింది. లడ్డూలకు ఫంగస్ వస్తే అవి తీసేసి, నాణ్యమైన లడ్డూలు విక్రయించాలి కానీ, రాములోరి భక్తులకు ఇలా పాచిపోయిన లడ్డూలు ఇస్తారా, మా ఆరోగ్యంతో చెలగాటం ఆడతారా? అంటూ భక్తులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.