Gandhi : అత్యాచార ఘటన సస్పెన్స్, బాధితురాలి అక్క ఎక్కడ ? నిందితుల కోసం గాలింపు

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘ‌ట‌న కేసులో స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది. బాధితురాలి అక్క జాడ దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది.

Gandhi : అత్యాచార ఘటన సస్పెన్స్, బాధితురాలి అక్క ఎక్కడ ? నిందితుల కోసం గాలింపు

Gandhi

Gandhi Hospital : గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘ‌ట‌న కేసులో స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది. బాధితురాలు చిలకలగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసి 24 గంట‌లు గ‌డిచినా చిక్కుముడి మాత్రం వీడ‌లేదు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ బాధితురాలి అక్క జాడ దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉంది. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Read More : చిరంజీవి‏పై ప్రకాష్ రాజ్ ప్రసంశల వర్షం

అక్క అదృశ్యం :-
ఈ కేసులో బాధితురాలి అక్క అదృశ్యం కలకలం రేపుతోంది. ఇప్పటికీ ఆమె జాడ తెలియలేదు. ఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు ఆమె గురించి గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. 13వ తేదీన ఆమె వెళ్తున్న ఓ సీసీ ఫుటేజీని గుర్తించారు. దాని ఆధారంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి 5 స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఇప్పటికే బాధితురాలి శాంపిల్స్ సేక‌రించిన పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే అనుమానితుల శాంపిల్స్‌ను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫోరెన్సిక్ నివేదిక‌లు వస్తేనే ఈ కేసు కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

Read More : Rakhi Sawant: స్పైడర్ ఉమెన్‌గా రాఖీ.. బిగ్‌బాస్‌లోకి ఆహ్వానించాలని డిమాండ్

మహిళా సంఘాల ఆందోళన :-
అత్యాచార ఘ‌ట‌న కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. మ‌హిళా సంఘాలు, వివిధ పార్టీలకు చెందిన మ‌హిళా విభాగం నాయ‌కురాళ్లు పెద్ద ఎత్తున చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారు. కానీ కేసు ద‌ర్యాప్తులో ఉన్న కార‌ణంగా ఎవ్వరిని పోలీసులు లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.
మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆమె.. అత్యాచార ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుల దర్యాప్తు జరుగుతుందని.. నిందితులెవరైనా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.

Read More : Mirabai Chanu : ఆమ్‌వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను

మహిళలు వేధిస్తే కఠిన చర్యలు2 :-
గాంధీ ఆస్పత్రి ఘటనపై హోంమంత్రి మమమూద్‌ అలీ, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గాంధీ అత్యాచార ఘటనపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వేగంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.