Gandhi Hospital: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా

హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. రెండు ఆసుపత్రుల్లోని సిబ్బంది అనేకమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Gandhi Hospital: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా

Hospital

Gandhi Hospital: దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. భారత్ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్షన్నర దాటేసింది. వైద్యసిబ్బంది సైతం కరోనా భారిన పడడం ఆందోళనకు గురిచేస్తుంది. హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. రెండు ఆసుపత్రుల్లోని సిబ్బంది అనేకమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించిన అధికారులు చికిత్స అందిస్తున్నారు.

Also read: Mumbai Bomb Threat: ముంబైలో పలుచోట్ల ఉగ్రదాడులంటూ ఫోన్ చేసిన వ్యక్తి అరెస్ట్

గాంధీ ఆస్పత్రి అనుబంధ సంస్థ మెడికల్ కళాశాలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు,10మంది హౌస్ సర్జన్లకు,10మంది PG విద్యార్థులకు, నలుగురు ఫ్యాకల్టీకి కోవిడ్ పోసిటివ్ గా నిర్ధారణ అయింది. గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల్లో 44 మంది కరోనా భారిన పడ్డారు. ఇక ఉస్మానియా ఆస్పత్రిలోనూ కరోనా కలకలం రేగింది. ఉస్మానియాలోని 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు 35 మంది హౌస్ సర్జన్లు,23 మంది జూనియర్ డాక్టర్లకు మరియు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు కరోనా సోకింది. ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 79 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. ఆసుపత్రుల్లో వైద్య విద్యార్థులకు, సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంపట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: Bomb Threat: తిరుపతి బస్టాండ్ వద్ద కలకలం సృష్టించిన సూట్ కేస్