Ganesh Chaturthi 2023: ఖైరతాబాద్‌లో కర్ర పూజ.. ఈ సారి ఎన్ని అడుగుల భారీ గణేశ విగ్రహమో తెలుసా?
గత ఏడాది పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిచ్చాడు.

GANAPATHI DEVA.. Pic Credit Sri Ganesh Utsava Committee
Ganesh Chaturthi 2023 – Khairatabad: హైదరాబాద్(Hyderabad)లోని ఖైరతాబాద్‌లో ఈ సారి 61 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ ఇవాళ కర్ర పూజ చేసింది. లైబ్రరీ బిల్డింగ్ వద్ద కర్ర పూజ కార్యక్రమం జరిగింది.

Khairatabad Ganpati Karra Pooja
ఈ కర్ర పూజకు ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయిన గణేశ్ ఉత్సవ కమిటీ మాజీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కోరిక మేరకు ఈ సారి 61 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఖైరతాబాద్ లో ఆ కమిటీ (Khairatabad Ganesh Utsav Committee) గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండడం ఇది 69వ సారి. సెప్టెంబరు 19న (Ganesh Chaturthi 2023 Date) వినాయక చవితి ఉంది. ఆ రోజు నుంచి భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవచ్చు.
దాదాపు మూడు నెలల ముందు నుంచే విగ్రహానికి సంబంధించిన పనులను మొదలు పెడతారు. గత ఏడాది పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిచ్చాడు. ఈ సారి ఏ రూపంలో దర్శనమిస్తాడన్న విషయాన్ని ఇంకా నిర్వాహకులు తెలపలేదు. గత ఏడాది కూడా 60 అడుగుల ఎత్తు మట్టి విగ్రహాన్ని రూపొందించారు. ఈ సారి అంతకంటే ఒక అడుగు పెంచారు.
పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మహా గణేశుడిని ప్రతి ఏడాది లక్షలాది మంది దర్శించుకుంటారు.