Ganesh Immersion : హైదరాబాద్ లో ప్రశాంతంగా గణేశ్‌ నిమజ్జనం..భక్తులతో కిక్కిరిసిపోయిన ట్యాంక్‌బండ్‌

హుస్సేన్‌సాగర్‌ జనసంద్రమైంది.... కనుచూపుమేర ఎటు చూసినా జనమే... గణనాథుడి నిమజ్జనానికి జనం పోటెత్తారు. ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో భక్తుల కోలాహాలం నెలకొంది.

Ganesh Immersion : హైదరాబాద్ లో ప్రశాంతంగా గణేశ్‌ నిమజ్జనం..భక్తులతో కిక్కిరిసిపోయిన ట్యాంక్‌బండ్‌

Ganesh Immersion (1)

భాగ్యనగరంలో గణేశ్‌ శోభయాత్ర శోభాయమానమైంది. ట్యాండ్‌బండ్‌ జనసందోహంగా మారింది. హుస్సేన్‌సాగర్‌, ట్యాండ్‌బండ్‌ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై బోలో గణేశ్‌ మహరాజ్‌ కీ జై… నినాదాలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మార్మోగాయి. డీజే సాంగ్స్‌, యువత డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

హుస్సేన్‌సాగర్‌ జనసంద్రమైంది…. కనుచూపుమేర ఎటు చూసినా జనమే… గణనాథుడి నిమజ్జనానికి జనం పోటెత్తారు. ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో భక్తుల కోలాహాలం నెలకొంది. ఎటు చూసినా జనంతో… హుస్సేన్‌సాగర్ పరిసరాలన్నీ జన సాగరాన్ని తలపించాయి. ఇసుకెస్తే రాలనంత జనం గణేశ్‌ నిమజ్జనానికి తరలివచ్చారు. సాధారణంగా ఏదైనా కార్యక్రమానికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారని అంటుంటాం. కానీ ఈ విజువల్స్ చూస్తే నిజంగానే ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చినట్లు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది.

Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం..బారులు తీరిన విగ్రహాలు

భాగ్యనగరంలో తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు భక్తజనం ట్యాండ్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌కు క్యూ కట్టారు. వేలాది గణేషుల ప్రతిమలతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ కోలాహలంగా మారింది. భక్తుల జయజయ ధ్వానాలతో కిక్కిరిసిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటూ చిన్నా, పెద్దా తేడా లేకుండా సంబరాలు చేసుకున్నారు.

గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా నినాదాల‌తో భ‌క్తులు నిమ‌జ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కజేయకుండా… వానలో తడుస్తూనే గణేశ్‌ నిమజ్జనాన్ని కన్నులారా తిలకించారు. డీకే పాటలకు యువత డ్యాన్స్‌లతో హోరెత్తించింది. సాధారణంగా నిమజ్జనం రోజు మధ్యాహ్నం నుంచి హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో భారీగా జనం చేరతారు. కానీ ఈసారి మాత్రం ఉదయం నుంచే ఎన్టీఆర్ మార్గ్ జనంతో నిండిపోయింది. భారీ గణనాథులను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. బై బై గణేశా అంటూ వీడ్కోలు పలికారు.

VP Sajjanar: ఆర్టీసీ బస్సులో గణేశ్ నిమజ్జనానికి బయల్దేరిన సజ్జనార్

ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం అంటే భాగ్యనగరంలో పెద్ద వేడుక. ప్రతీ ఏటా నిమజ్జనం రోజు గణపయ్యను చూసేందుకు వేలాది మంది తరలివస్తారు. ఈసారి కూడా అదే ట్రెండ్ నడిచింది. గతేడాది నిమజ్జనం లేకపోవడంతో ఈసారి ఎలాగైనా యాత్రను చూడాలని జనం భారీగా తరలివచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ఉండదు.

మట్టి విగ్రహాన్నే నెలకొల్పుతామని ఇప్పటికే నిర్వాహకులు సైతం ప్రకటించారు. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ఇదే చివరిసారి కానుండటంతో.. బడా గణపయ్య సాగరంలో గంగమ్మ ఒడికి చేరడాన్ని భక్తులు ఆనందంగా వీక్షించారు. మళ్లీరా మా బొజ్జ గణపయ్య అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు.