Ganesh Nimajjanam 2021: గంగమ్మ ఒడికి బయల్దేరిన ఖైరతాబాద్ పంచముఖ గణేశుడు

నవ రాత్రులు విశేష పూజలు అందుకున్న పంచముఖ మహాగణపతి నిమజ్జనోత్సవం మొదలైంది. ఆదివారం 2021 సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను.

10TV Telugu News

Ganesh Nimajjanam 2021: నవ రాత్రులు విశేష పూజలు అందుకున్న పంచముఖ మహాగణపతి నిమజ్జనోత్సవం మొదలైంది. ఆదివారం 2021 సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. 162 గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ విధుల్లో ఉండగా 330 క్రేన్లను అరెంజ్‌ చేశారు.

 

 

 • ట్యాంక్ బండ్‌కు చేరుకున్న గణేశుడు

  వేల మంది ఊరేగింపుతో పంచముఖ గణనాథుడు ట్యాంక్ బండ్ చేరుకున్నాడు. ముందుగా నిర్ణయించిన 2గంటల సమయానికే ట్యాంక్ బండ్ కు చేరుకున్నా.. ఏర్పాట్ల కారణంగా మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. క్రేన్ నెం.6వద్ద నిమజ్జనానికి ప్లాన్ చేశారు నిర్వాహకులు.

 • తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చేరుకున్న పంచముఖ గణపతి

  భారీ జనసందోహం సమక్షంలో పంచముఖ గణనాథుడు తరలివస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కు చేరుకున్నాడు. అటు నుంచి ఓల్డ్ సెక్రటేరియట్ గేట్ మీదుగా ప్రయాణం జరగనుంది.

 • బీఎస్ఎన్ఎల్ రోడ్‌కు చేరుకున్న గణ నాయకుడు

  దాదాపు 2గంటల పాటు ప్రయాణం తర్వాత బీఎస్ఎన్ఎల్ రోడ్‌కు చేరుకున్నాడు వినాయకుడు. మధ్యాహ్నం 2గంటల సమయం వరకూ నిమజ్జనం పూర్తి చేసుకోవాలని భావించిన నిర్వాహకులు కీలక జాగ్రత్తలతో గణేశ్ 40అడుగుల విగ్రహాన్ని తరలిస్తున్నారు.

 • వేలంలో లడ్డూను సొంతం చేసుకున్న మర్రి శశాంక్ రెడ్డి

  దశాబ్దాల కాలంగా చారిత్రక ఘనత దక్కించుకున్న బాలాపూర్ లడ్డూ.. ఈ ఏడాది సైతం భారీ ధరకు అమ్ముడుపోయింది. రూ.18లక్షల 90వేలకు మర్రి శశాంక్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఏడాది స్వామి వారి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.

   

 • బాలాపూర్ లడ్డూ వేలం

  గణనాథుడి ప్రసాదం బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ మొదలైంది. ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమం మొదలైంది. గత సంవత్సరాలతో పోలిస్తే.. ఈ సారి రూ.20లక్షలకు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

 • గణనాయకుని ప్రయాణం మొదలు

  ప్రత్యేక పూజలు అందుకుని ఖైరతాబాద్ మండపం నుంచి భారీ ఊరేగింపుతో వినాయకుడు బయల్దేరాడు. అనుకున్న ముహూర్తానికి 9గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 • 2.5 కిలోమీటర్ల ఊరేగింపు

  ద్వారకా హోటల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ సెక్రటేరియట్ గేట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లుంబినీ పార్క్ మీదుగా శోభాయాత్ర జరగనుంది. మొత్తం 2.5కిలోమీటర్ల మేర ఊరేగింపు జరిపి.. ట్యాక్ బండ్ క్రేన్ నెం.6 వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి చేస్తారు.

 • విజయవాడ నుంచి ప్రత్యేక క్రేన్లు

  ఉదయం 9గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గణేశుడి ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటికే విజయవాడ నుంచి భారీ క్రేన్లను హైదరాబాద్ తరలించారు.

 • 9 గంటలకు ముహూర్తం

  ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 9 గంటలకు 40 అడుగుల పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు. భారీ గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.