Gang War: బంజారాహిల్స్ లో గ్యాంగ్ వార్.. నలుగురికి గాయాలు

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్‌లో గ్యాంగ్ వార్ జరిగింది. కుక్కకు రాయి విసిరిన విషయంలో 20 మందికి గొడవకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సందీప్‌, మనోజ్‌ అనే ఇద్దరు యువకులు సినీ పరిశ్రమలో డిజైనర్‌లుగా పనిచేస్తూ బంజారాహిల్స్ నెంబర్ 14 నందినగర్‌లో నివాసం ఉంటున్నారు.

Gang War: బంజారాహిల్స్ లో గ్యాంగ్ వార్.. నలుగురికి గాయాలు

Gand War

Gag War: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్‌లో గ్యాంగ్ వార్ జరిగింది. కుక్కకు రాయి విసిరిన విషయంలో 20 మందికి గొడవకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సందీప్‌, మనోజ్‌ అనే ఇద్దరు యువకులు సినీ పరిశ్రమలో డిజైనర్‌లుగా పనిచేస్తూ బంజారాహిల్స్ నెంబర్ 14 నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. గత రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేశారు..

ఇదే సమయంలో వీరి పక్క ఇంట్లో ఉండే శ్రీను తన కుక్కను తీసుకోని బయటకు వచ్చాడు. వీరిని చూసిన కుక్క కరిచినంత పనిచేసింది. దానిని నుంచి తప్పించుకునేందుకు సందీప్ రాయి విసిరాడు. అక్కడ మొదలైన వివాదం కాస్త గ్యాంగ్ వార్ కు దారి తీసింది. కుక్కకు రాయి విసరడంతో శ్రీను వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న యువకులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి భయపడ్డ సందీప్, మనోజ్ లు విషయాన్నీ స్నేహితులకు తెలిపారు.

చిత్రపరిశ్రమలో పనిచేసిన వారి మిత్రులు బొబ్బిలి సుదర్శన్, కందుకూరి అనిల్, ఆదిత్యతో మరో ఇద్దరు అక్కడకు వచ్చారు. ఇదే సమయంలో గొడవ ముదిరింది. దీంతో కాలనీ వాసులు సందీప్, మనోజ్ స్నేహితులపై దాడి చేశారు. ఈ దాడిలో బొబ్బిలి సుదర్శన్ తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేష్‌, నర్సింగ్‌ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గలాటలో హస్తం ఉన్న మరికొంత మంది పరారీలో ఉన్నారు.