Online Marriage : స్వీడన్‌లో పెళ్లి.. నిర్మల్‌లో భోజనాలు

నిర్మల్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌‌లు నిశిత్ రెడ్డి, గాయత్రిలు స్వీడన్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహవేడుకను ఆన్‌లైన్‌లో టెలికాస్ట్ చేశారు. నిర్మల్‌లో ఈ వివాహాన్ని బంధువులు వీక్షించారు

Online Marriage : స్వీడన్‌లో పెళ్లి.. నిర్మల్‌లో భోజనాలు

Online Marriage

Online Marriage :  ప్రస్తుతం ఆన్‌లైన్ యుగం నడుస్తుంది. ఏది కావాలన్నా సెలెక్ట్, బుక్, టేక్‌లా మారిపోయింది. ఈ ఆన్‍లైన్ యుగంలో ఏది కాలవన్న ఇంటివద్దకు వస్తున్నాయి. ఈ కాలం యువతి, యువకులు నెట్టింట పరిచయాలకే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో మధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిళ్లలో చాలావరకు ఆన్‌లైన్ పరిచయాలతో ప్రేమలో పడి చేసుకునేవే అధికంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అంతర్జాలంలోని జరిగిపోతున్నాయి.

చదవండి : Forced Marriage : తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి చేశారు

కరోనా పుణ్యమా అని ఈ ఆన్‌లైన్ పెళ్లిళ్లు అధికమయ్యాయి. వర్చువల్ విధానంలో పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఆన్‌లైన్ వివాహం జరిగింది. వధూవరులు స్వీడన్‌లో పెళ్లి చేసుకొని ఈ వేడుకను ఆన్‌లైన్‌లో లైవ్ టెలికాస్ట్ చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన అబ్బడి మంజుల–శ్రీనివాస్‌రెడ్డిల కుమార్తె గాయత్రి, ఎర్ర ప్రసాద్‌రెడ్డి–పుష్పలతల కుమారుడు నిశిత్‌రెడ్డి ఇద్దరూ స్వీడన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కొద్దీ నెలల క్రితం నిర్మల్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

చదవండి : Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు

అయితే పెళ్లి సమయానికి కరోనా నిబంధనలు అడ్డు వచ్చాయి. దీంతో వారు ఆన్‌లైన్ పెళ్ళికి సిద్ధమయ్యారు..స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల గణేశ్‌ ఆలయంలో ఆదివారం ఇక్కడి కాలమాన ప్రకారం 12గంటలకు వివాహం చేసుకున్నారు. నిర్మల్‌లో వారి కుటుంబాలు పెద్ద టీవీ స్క్రీన్‌ ఏర్పాటు చేసుకుని తమ పిల్లల పెళ్లిని వీక్షించారు. ఆన్‌లైన్‌లో ఆశీర్వదించేశారు. బంధుమిత్రులు లైవ్‌లోనే కొత్తజంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.