Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద సాధారణ పరిస్థితులు .. ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణానికి తెరపడింది. రైలు పట్టాలు, ప్లాంట్ ఫామ్ పై బైఠాయించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది. ఆందోళనలన కారులను అదుపులోకి తీసుకొనే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేసి ఏఆర్ఓ కార్యాలయానికి తరలించారు.

Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద సాధారణ పరిస్థితులు .. ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

Secundrabad

Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణానికి తెరపడింది. రైలు పట్టాలు, ప్లాంట్ ఫామ్ పై బైఠాయించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది. ఆందోళనలన కారులను అదుపులోకి తీసుకొనే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేసి ఏఆర్ఓ కార్యాలయానికి తరలించారు. దీంతో రాత్రి 7.40 గంటల నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాకినాడ వెళ్లే ట్రైన్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాత్రి 10గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు. అయితే రాత్రంతా స్టేషన్ వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

Minister Kishan Reddy: ’అగ్నిపథ్‌‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం అదుపులోకి రావడంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి మెట్రో సౌకర్యం ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన విషయం విధితమే. ఉదయం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా, పదిహేను మంది వరకు గాయాలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ వాతావరణం రైల్వే స్టేషన్ వద్ద నెలకొంది.

Agnipath protests: ఆందోళనల ఎఫెక్ట్.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వం

సాయంత్రం 6గంటల సమయంలో ఉదయం నుంచి సాగుతున్న సస్పెన్స్ కు పుల్ స్టాఫ్ పడింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం వేలాది గా ఉన్న ఆందోళన కారులు సాయంత్రానికి తక్కువ మంది కావడంతో స్టేషన్ నలువైపులా పోలీసులు చుట్టుముట్టారు. స్టేట్ పోలీసులతో పాటు ఆర్ఫీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ స్టార్ట్ చేసిన పది నిమిషాలలో క్లోజ్ చేశాయి. పోలీసు బలగాలు ఎక్కువ కావడం, ఆందోళన కారుల బలం తగ్గడంతో స్వల్ప ప్రతిఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిరసన కారులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.