కోవిడ్ 19 అనుమానితుల ఇళ్లకు జియో ట్యాగింగ్

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 06:35 AM IST
కోవిడ్ 19 అనుమానితుల ఇళ్లకు జియో ట్యాగింగ్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్  వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు.  ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు గృహా నిర్భంధంలో ఉన్న వారి కదలికలను గురించి తెలుసుకోవటానికి వీలుగా ట్యాగ్ చేయబడింది.

టీఎస్‌ కాప్‌ యాప్ ద్వారా విదేశాల్లో నుంచి తిరిగి వచ్చిన వారి ఇంటిని జియో ట్యాగ్‌ అనుసంధానం చేయబడింది. దీంతో వారి ఇంటి నెంబరు, వారి ఇంట్లో ఎంత మంది ఉంటున్నారనే విషయం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వారు విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారు,ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలను తెలుసుకుని పోలీసులు అప్లికేషన్ లో భద్రపరుస్తున్నారు. 

ఈ జియో ట్యాగ్‌ను పెట్రోలింగ్ ట్యాబ్‌లతో అనుసంధానం చేశారు. వీటిని ఉపయోగించి పెట్రోలింగ్‌ సిబ్బంది వారి విధుల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. వారు ఐసోలేషన్‌లో ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంటి విషయాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. వారికి ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే విషయాలన్ని తెలుసుకోవటానికి పోలీసులకు సహాయపడుతుంది.

See Also | లాక్ డౌన్‌ను సీరియస్‌గా పట్టించుకోవడం లేదేం: మోడీ