Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు | Ghatkesar police arrested TPCC chief Revanth Reddy

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు

పరామర్శకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు

Revanth Reddy : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్టయ్యారు. ఘట్‌కేసర్ వద్ద రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌ ఆందోళనల్లో మృతి చెందిన రాకేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకుని.. ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పరామర్శకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.

ఇక రాకేశ్‌ అంత్యక్రియలను ఇవాళ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాకేశ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాకేశ్‌ స్వగ్రామం దబ్బీర్‌పేట గ్రామంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాకేశ్‌ మృతదేహాన్ని సాయంత్రం 4 గంటల వరకు దబ్బీర్‌పేట గ్రామానికి తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు నర్సంపేట బంద్‌కు పిలుపునిచ్చారు.

Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్

రాకేశ్‌ మృతదేహం నిన్ననే వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. రాత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇవాళ మృతదేహాన్ని ర్యాలీగా స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాకేశ్‌ మృతదేహానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు నివాళులు అర్పించారు.

×