DE Mahalakshmi : చనిపోయిన స్వీపర్ భార్యకు ఉద్యోగం ఇచ్చినందుకు లంచం తీసుకున్న DE..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB

DE Mahalakshmi : చనిపోయిన స్వీపర్ భార్యకు ఉద్యోగం ఇచ్చినందుకు లంచం తీసుకున్న DE..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB

Ghmc De Mahalakshmi

DE Mahalakshmi : అధికారాన్ని చేతిలో ఉంది కదాని లంచాలు బొక్కే అధికారులు ఎప్పటికప్పుడు అవినీతి నిరోధ‌క శాఖ అధికారులకు చిక్కుతునే ఉన్నారు. ఈక్రమంలో ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. లంచాలను మరిగి ఆఖరిని తమ కింద పనిచేసే స్వీసర్ స్థాయి ఉద్యోగులకు కూడా వదలకుండా జలగల్లా పీల్చుకుతింటున్న ఓ అధికారి ఏసీబీకి చిక్కారు. భర్త చనిపోతే వచ్చిన ఉద్యోగం చేసుకుంటున్న స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి.

జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ మ‌హాల‌క్ష్మి ఏసీబ)కి చిక్కారు. స్వీప‌ర్ నుంచి లంచం తీసుకుంటూ మ‌హాల‌క్ష్మి అధికారులకు అడ్డంగా ప‌ట్టుబ‌డ్డారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న రాములు ఇటీవ‌ల‌ అనారోగ్యంతో మృతి మృతిచెందాడు. దీంతో ఆమె ఉద్యోగం అతని భార్య సాలెమ్మకు ఆ ఉద్యోగం వచ్చింది. రాములు భార్య సాలెమ్మకు ఆ ఉద్యోగం ఇచ్చినందుకు గాను తనకు రూ.20వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు డీఈ మ‌హాలక్ష్మి. ఆ డబ్బుని తన అసిస్టెంట్ విజయ్ కు ఇవ్వాలని చెప్పింది. ఈ విషయాన్ని సాలెమ్మ తన కొడుకుకు చెప్పగా..అతను ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు.

అనుకున్న ప్లాన్ ప్రకారంగా..మ‌ల్లాపూర్‌లోని ఓ హోట‌ల్‌లో డీఈ మహాలక్ష్మి అసిస్టెంట్ కు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. డబ్బులు ఇస్తున్న సమయంలోనే లోపలికి ఎంటర్ అయిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా డీఈ మహాలక్ష్మి తీసుకోమంటేనే తీసుకున్నానని దీంట్లో నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు.అలా డీఈ లంచావతారం విషయం బైటపడింది. అలా ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఏసీబీ డీఎస్సీ సూర్యనారాయణ నేతృత్వంలోని బృందం డీఈ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు భారీగా నగదు..బంగారం పట్టుబడింది. డీఈ లంచం డిమాండ్ చేసిన విషయం రుజువైందని ఏసీబీ డీఎస్పీ సూర్యనాయారణ మీడియాకు తెలిపారు.