జీహెచ్ఎంసీ ఎన్నికలు : పార్టీలు మారుతున్న టికెట్ దక్కని నేతలు

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 09:39 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : పార్టీలు మారుతున్న టికెట్ దక్కని నేతలు

GHMC elections : జీహెచ్ఎంసీ నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. టికెట్ ఆశిస్తున్న నేతలు జంపింగ్ జపాంగ్‌లుగా మారుతున్నారు. తామున్న పార్టీలో టికెట్ దక్కనుకుంటే.. ప్రత్యర్థి పార్టీల్లోకి దూకేస్తున్నారు. సిట్టింగ్‌లకే ప్రాధాన్యత ఇచ్చిన టీఆర్ఎస్.. 125 స్థానాల్లో ఇప్పటి వరకు 10చోట్ల మాత్రమే అభ్యర్థులను మార్చింది.



https://10tv.in/ghmc-elections-prohibition-of-pasting-posters-and-wall-writing/
అయినా.. పార్టీలో అసంతృప్త సెగలు రేగుతున్నాయి. సీటు దక్కదన్న భయంతో కొందరు, స్థానిక ఎమ్మెల్యేలతో పొసగక మరికొందరు పార్టీ మారారు. ఒకటి, రెండు డివిజన్లలో మరోసారి పోటీ చేయమని కొందరు కార్పొరేటర్లు స్వచ్ఛందంగా తప్పుకున్నారు.



వెంగళ్‌రావు నగర్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ ఖరారు చేయలేదు. టికెట్ దక్కదన్న అనుమానంతో కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీలో చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి తీరుకు నిరసనగా మల్లికార్జున్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి హరీశ్‌రావు బుజ్జగింపుతో తోట అంజయ్య బీజేపీ నుంచి తిరిగి టీఆర్ఎస్‌లో చేరారు.