జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : వామపక్షాల తొలి జాబితా

  • Edited By: bheemraj , November 19, 2020 / 10:28 AM IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : వామపక్షాల తొలి జాబితా
ad

GHMC elections left parties First list : జీహెచ్‌ఎంసీలో ఎన్నికల వేడి రాజుకుంది. విపక్ష పార్టీలన్నీ గ్రేటర్‌లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్లకు రేపటి వరకే చాన్స్‌ ఉండడంతో అభ్యర్థుల జాబితాను పోటాపోటీగా విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ రెండు సార్లు లిస్ట్‌లు ప్రకటించగా.. బీజేపీ, వామపక్షాలు తమ తొలి జాబితాలను విడుదల చేశాయి.బల్దియా ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాలో ఎక్కువ సీట్లు గెలిస్తే.. అది రాష్ట్రమంతా ప్రభావం చూపుతుంది. దీంతో ఇక్కడ ఎక్కువ డివిజన్లలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో మునిగిపోయాయి. ఇప్పటికే గెలుపు గుర్రాలపై కసరత్తు పూర్తి చేశాయి. దీంతో పోటాపోటీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించేస్తున్నాయి.https://10tv.in/ghmc-elections-2020-bjp-focus-on-bcs/
ఇక గ్రేటర్‌లో తమ ఉనికిని చాటుకునేందుకు వామపక్షాలు కూడా రెడీ అయ్యాయి. సీపీఐ, సీపీఎంతోపాటు ఇతర వామపక్షపార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో మొత్తం 50 స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యాయి. తొలి విడతగా 11మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇక టీడీపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలు కూడా పలుచోట్ల పోటీకి సిద్ధమయ్యాయి.గ్రేటర్‌ పీఠంపై బీజేపీ ఈసారి కన్నేసింది. ఎలాగైనా మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. గతంలో ఎన్నడూలేనంతగా గ్రేటర్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 21 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన బీజేపీ జాతీయనేత భూపేంద్ర యాదవ్‌తో కలిసి చర్చించిన తర్వాత అభ్యర్థుల పేర్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. బీజేపీ మొదటి లిస్టులో పాతనగరంలోని డివిజన్లే ఎక్కువగా ఉన్నాయి.ఇవాళ మిగిలిన డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తుది లిస్ట్‌ల కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. అక్కడ టిక్కెట్‌ దక్కని వారిని తమ పార్టీలో చేర్చుకొని డివిజన్లు కేటాయించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలకంగా భావిస్తున్న డివిజన్లు అన్నిటిని పెండింగ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

గ్రేటర్‌లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేసుకుంటుంది. బల్దియా పోరులో పరువు నిలుపుకోవడం కోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది. రెండు విడతలుగా పోటీచేయనున్న అభ్యర్థుల జాబితా విడుల చేసింది. ఈ రెండు లిస్ట్‌ల్లో కలిపి మొత్తం 45 వార్డులకు క్యాండిడేట్స్‌ను ఖరారు చేసింది. మిగిలిన డివిజన్లకూ ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.