GHMC : అక్రమ ఫ్లెక్సీకి రూ. లక్ష జరిమానా

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బార్ అండ్ రెస్టారెంట్‌కు ఏర్పాటు చేసుకున్న 15 ఫీట్ల బోర్డుకు జీహెచ్ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది.

GHMC : అక్రమ ఫ్లెక్సీకి రూ. లక్ష జరిమానా

Ghmc (1)

GHMC fine of Rs 1 lakh : అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీలు, బోర్డులపై జీహెచ్‌ఎంసీ కొరడా విదిలించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బార్ అండ్ రెస్టారెంట్‌కు ఏర్పాటు చేసుకున్న 15 ఫీట్ల బోర్డుకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఒక పౌరుడు.. బార్ బోర్డ్ ఫోటో తీసి ఆన్ లైన్‌లో కంప్లైంట్ చేయడంతో ఈ ఫైన్‌ వేసింది.

హైదరాబాద్ లోని తార్నాక మెయిన్ రోడ్డుపై ఇటీవలే ప్రారంభమైన గ్లాస్ మేట్ అనే బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేశారని లక్ష రూపాయలు జరిమానా విధించారు. అయితే ఒక సిటిజన్ బార్ బోర్డు ఫొటో తీసి ఆన్ లైన్ లో కంప్లైంట్ చేయడంతో జరిమానా విధించారు. ఎంతో మందికి బార్లలో కిక్కు ఎక్కేదాకా మద్యం తాగించి బిల్లు వసూలు చేసే బార్ ఓనర్ కు జీహెచ్ఎంసీ దెబ్బతో మత్తు దిగి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో చలి పులి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై విమర్శలు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఒక్కో ఫ్లెక్సీకి రూ.5 వేల వరకు అధికారులు జరిమానాలు విధించారు.