గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ రాజకీయ ప్రస్థానం

గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ రాజకీయ ప్రస్థానం

Gadwala Vijayalakshmi’s Political life : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మీ పేరును కార్పొరేటర్ ఫసియుద్దీన్ ప్రతిపాదించారు. గాజులరామారం కార్పొరేటర్ సమర్థించారు. ఎంఐఎం కార్పొరేటర్లు టీఆర్ఎస్ కు మద్దుతు తెలిపారు.

టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కుమార్తె విజయలక్ష్మీ. కే.కేశవరావు వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి ఎన్నికయ్యారు. విజయలక్ష్మీ జర్నలిజంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 18 ఏళ్లు అమెరికాలో ఉన్న ఆమె డ్యూక్ వర్శిటీలో పరిశోధన సహాయకురాలిగా పని చేశారు.

2007లో భారతదేశానికి విజయలక్ష్మీ తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. విజయలక్ష్మీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మీ.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బాబీరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.