పెంపుడు జంతువులకు UID పంపిణీ మొదలుపెట్టిన GHMC

పెంపుడు జంతువులకు UID పంపిణీ మొదలుపెట్టిన GHMC

మనుషులకు యూనిక్ ఆధార్ ఐడెంటిఫికేషన్ నెంబర్ దొరుకుతున్నప్పుడు మనుషులు బెస్ట్ ఫ్రెండ్ అయిన పెంపుడు జంతువులకు ఎందుకు ఇవ్వకూడదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిటీలో పెంపుడు జంతువులకు యూనిక్ నెంబర్లు ఇవ్వడం ప్రారంభించింది. వాటి యజమానులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని సూచిస్తున్నారు. డాగ్ బ్రీడ్ ను బట్టి కూడా ఈ నెంబర్ లో మార్పు ఉంటుంది. దాని వయస్సు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గురించి సైతం పొందుపరుస్తారు.

మీ పెంపుడు జంతువు పెంచుకోవడానికి ఇంటి పక్క ఉన్న వారి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో టోకెన్ సిస్టమ్స్ ప్రోసెస్ ద్వారా జరుగుతుంది. ఈ ప్రోసెస్ మొత్తం ఆన్ లైన్ లోనే జరుగుతుందని జీహెచ్ఎంసీ వెటర్నరీ వింగ్ చెప్తుంది. పెంపుడు జంతువులు ఇంట్లో పెంచుకునేందుకు కచ్చితంగా రిజిష్టర్ అనేది మ్యాండేటరీ చేయడంతో యజమానులకు కంఫర్ట్ దొరుకుతుందని అధికారులు అంటున్నారు.

కొత్త ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఒకసారి అవసరమైన సమాచారాన్ని అప్ లోడ్ చేశాక.. యూనిక్ ఐడీ నెంబర్ అనేది (సర్కిల్ నెంబర్, వార్డ్ నెంబర్, సంవత్సరం) వివరాలతో సహా యజమానికి వచ్చేస్తుంది. ఇదంతా ఒక్కరోజులో పూర్తవుతుంది. ఇది యూనిక్ నెంబర్. వేరే జంతువు దేనికి అలాట్ చేయరు.

MyGHMC appలేదా GHMC websiteలో డిటైల్స్ అప్‌లోడ్ చేయాలి. రిజిష్ట్రేషన్ ఫీజు కింద రూ.50 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. గతంలో చేసిన పెంపుడు జంతువుల లైసెన్స్ రెన్యూవల్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ చెప్పారు.

ఈ సర్వీసు గత నెలలోనే ప్రారంభమైందని ఇప్పటికీ 76 ఆన్‌లైన్‌ లైసెన్సులు ఇష్యూ చేసినట్లు చెప్పారు. మునిసిపల్ కార్పొరేషన్ 101 అప్లికేషన్లు రిసీవ్ చేసుకుందని వాటిల్లో 76 అప్రూవ్ పొందాయని మిగిలిన వాటిని రివర్ట్ చేశామని చెప్తున్నారు అధికారులు. ఏటా 7వేల నుంచి 8వేల లైసెన్సులు ఇష్యూ చేస్తుంది జీహెచ్ఎంసీ.