GHMC Isolation Centres : ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు

రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్

GHMC Isolation Centres : ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు

Ghmc Isolation Centers

GHMC Isolation Centres :  హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నగరంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లోని వారికి ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నాయి. దీంతో వారిని ఇంటి వద్దనే జాగ్రత్తలు తీసుకోవాలని పంపిస్తున్నారు వైద్య సిబ్బంది. చిన్ని చిన్న ఇళ్లలో ఉన్న వారికి హోం ఐసోలేషన్ ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో స్పెషల్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిపెట్టారు.

హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసులు సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

అయితే కరోనా వచ్చిన చాలా మందికి ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉండటంలేదు. దాంతో అలాంటి వారిని హాస్పిటల్‌లో చేర్చుకోకుండా ఇంటికి పంపిస్తున్నారు వైద్యాధికారులు. నగరంలో ప్రాథమిక హెల్త్ సెంటర్లు..ఇతర పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి రిజల్ట్ వచ్చిన వెంటనే ఆరోగ్య ఇబ్బందులు ఉంటే ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. లేదంటే ఇంటి వద్ద హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక ఇంటి వద్దనే హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ప్రభుత్వం…జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయ్యాలని నిర్ణయించాయి. వారి ఇంటి వద్ద అన్ని రకాల శానిటైజ్ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అంతే కాకుండా పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్ల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయ్యాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఆరు జోన్లలో సుమారు 500 మంది సిబ్బందిని నియమించి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జీహెచ్ఎంసీ పరిధిలో 5,26,885 గృహాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేసినట్లు చెబుతున్నారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. నగరంలోని 4,846 కాలనీలలో రెండో డోస్ వ్యాక్సినేషన్ తుది దశకు చేరిందని…18 సంవత్సరాలలోపు వారికి వ్యాక్సినేషన్ కోసం కూడా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుందని మేయర్ తెలిపారు.

అయితే నగరంలో చాలా మందికి చిన్న చిన్న ఇళ్లు ఉండటం…ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేని ఇళ్ళు ఉండటంతో పాటు చిన్న చిన్న ఇరుకు ఇళ్ళల్లో లేదా గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బల్దియా నిర్ణయించింది. జీహెచ్ఎంసీలోని 30సర్కిళ్లోని మూడు నుండి ఐదు స్పెషల్ ఐసోలేషన్ సెంటర్లును గుర్తించాలని అధికారులు నిర్ణయించారు.
Also Read : Live-in Relationship : సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ప్రియుడు
నగరంలో కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ చెబుతున్నారు. దాంతో ప్రభుత్వ హాస్టల్స్…, పాఠశాలలు…, ఫంక్షన్ హాల్స్…, తోపాటు ప్రయివేటు హాస్టల్స్ లో హోం ఐసోలేషన్ పెంటర్లు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు డిప్యూటి కమీషనర్లు.