Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన షేక్ ఆశ్వ‌క్‌(19), స్థానికంగా ఉన్న ఫాతిమా(19)ను గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో ఫాతిమాకు మ‌రొక‌రితో పెళ్లి చేయాల‌ని ఆమె కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు.

Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Boyfriend Attempted Suicide : హైద‌రాబాద్ లో దారుణం జరిగింది. ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం జరగడంతో ప్రియుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రియురాలికి వివాహం జ‌రుగుతున్న ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద‌కే వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘ‌ట‌న లంగ‌ర్‌హౌజ్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన షేక్ ఆశ్వ‌క్‌(19), స్థానికంగా ఉన్న ఫాతిమా(19)ను గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో ఫాతిమాకు మ‌రొక‌రితో పెళ్లి చేయాల‌ని ఆమె కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. ఈ మేరకు నిన్న లంగ‌ర్‌హౌస్‌లోని మొగ‌ల్ ఫంక్ష‌న్ హాల్‌లో ఫాతిమాకు మ‌రో వ్య‌క్తితో పెళ్లి చేశారు.

Lovers Suicide : విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఈ విష‌యం ఆశ్వ‌క్‌కు తెలియ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. వెంటనే పెళ్లి జరుగుతున్న ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద‌కు వెళ్లి..కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలార్పి, అత‌డిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేస్తున్నారు.