Gitam University: గీతం యూనివర్సిటీ వద్ద వందలాది మంది విద్యార్థుల ఆందోళన.. భారీగా చేరుకున్న పోలీసులు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే ఉండాల్సిన హాజరు శాతాన్ని పెంచడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే, మరికొన్ని సమస్యలపై మండిపడుతున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి క్యాంపస్ గేటు వద్ద వందలాంది మంది విద్యార్థులు ఆందోళనకు దిగి దాన్ని విరమించుకోవడం లేదు. దీంతో వర్సిటీ క్యాంపస్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

Gitam University: గీతం యూనివర్సిటీ వద్ద వందలాది మంది విద్యార్థుల ఆందోళన.. భారీగా చేరుకున్న పోలీసులు

Gitam University: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే ఉండాల్సిన హాజరు శాతాన్ని పెంచడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే, మరికొన్ని సమస్యలపై మండిపడుతున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి క్యాంపస్ గేటు వద్ద వందలాంది మంది విద్యార్థులు ఆందోళనకు దిగి దాన్ని విరమించుకోవడం లేదు. దీంతో వర్సిటీ క్యాంపస్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

#justiceforgitamstudents పేరిట విద్యార్థులు తమ సమస్యలను, ఆందోళనను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అటెండెన్స్ నిబంధనలు పెట్టి తమను పీడిస్తున్నారని చెప్పారు. ప్రతి సెమిస్టర్ పరీక్ష మధ్య విరామం దొరకడం లేదని, చదువుకోవడానికి సమయం ఉండడం లేదని అంటున్నారు. సెమిస్టర్ పరీక్షలకు మూడు రోజుల ముందు కూడా సిలబస్ పూర్తి కావడం లేదని చెప్పారు. తమపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అన్నారు. తాము విశ్రాంతి తీసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..