KTR: పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్రాన్ని కోరిన కేటీఆర్

హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేదంటే స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు.

KTR: పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్రాన్ని కోరిన కేటీఆర్

KTR: తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాబోయే బడ్జెట్‌లో తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాలని ఆయన లేఖలో కోరారు. నిధుల కేటాయింపు కోరుతూ కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు పంపినా నిరాశే ఎదురవుతోందని కేటీఆర్ ఆరోపించారు.

Sri Lanka: శ్రీలంకకు భారత్ సాయం.. 75 రవాణా బస్సులు అందజేసిన ఇండియా

హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేదంటే స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. అయితే, కేంద్రం నిధులు కేటాయించకపోయినప్పటికీ మున్సిపాలిటీల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ జనాభాలో 47 శాతం పట్టణాల్లోనే నివసిస్తున్నారని, అన్ని రంగాల్లో రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

Jharkhand: కూరగాయల మార్కెట్‌కు బాంబుతో వచ్చిన వ్యక్తి.. బాంబు పేలి నలుగురికి తీవ్ర గాయాలు

పాలనలో సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న సంస్కరణలు, విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా పట్టణాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవార్డులు, రివార్డులే నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయిస్తారనే నమ్మకంతోనే ఈ లేఖ రాస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. తెలంగాణలో భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా గతంలో ఉన్న 68 మున్సిపాలిటీలను 142కు పెంచినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.