MLA Jagga Reddy : రూ.3016 ఇవ్వండి, హామీని నిలబెట్టుకోండి- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
నిరుద్యోగ భృతి అంశంపై ఆయన లేఖాస్త్రం సంధించారు. నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేఖలో కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా నిరుద్యోగులకు కాస్త ఊరట దక్కుతుందన్నారు.

MLA Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. నిరుద్యోగ భృతి అంశంపై ఆయన లేఖాస్త్రం సంధించారు. నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేఖలో కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా నిరుద్యోగులకు కాస్త ఊరట దక్కుతుందన్నారు.
”2018 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ 2018 మేనిఫెస్టోలో రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం రూ.3,016 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. రెండవసారి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా అమలు చేయలేదు. ఇంకో 8 నెలలు అయితే ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీయే కాబ్బటి అమలు చేయాలని కోరుతున్నా.
నిరుద్యోగ భృతి ఇస్తే నిరుద్యోగులకు ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులకు కూడా ఊరట ఇచ్చినవారు అవుతారు. డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి రూ.3,016 ఉపయోగపడతాయి. తాత్కాలికంగా నిరుద్యోగుల ఖర్చులకు రూ.3,016 ఉపయోగపడుతాయి.
ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాను. మరొకసారి గుర్తు చేయడానికి మాత్రమే సీఎంకి లేఖ రాస్తున్నా. వెంటనే నిరుద్యోగుల కోసం రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వడానికి నిధులు విడుదల చేయండి. నిరుద్యోగులకు మీరు ఇస్తామన్న 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతున్నా” అని లేఖలో సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.