వలస కార్మికుల రైలును మా రాష్ట్రంలో ఆపొద్దు : సీఎం  

  • Published By: nagamani ,Published On : May 15, 2020 / 11:17 AM IST
వలస కార్మికుల రైలును మా రాష్ట్రంలో ఆపొద్దు : సీఎం  

ఢిల్లీ నుంచి తిరునవంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలు (వలస కార్మికుల రైలు) ను మా రాష్ట్రంలోని మడగావ్‌ స్టేషనులో ఆపవద్దని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ రైల్వే శాఖను కోరారు. మడగావ్‌లో రైలు దిగేందుకు దాదాపు 720 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం ఉందని అన్న గోవా సీఎం…ఆ బుక్ చేసుకున్నవారిలో గోవాకు చెందిన వాళ్లు ఉన్నారా అన్న విషయంలో స్పష్టత లేదని..కానీ కరోనా రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో మడగావ్ లో ప్రత్యేక రైలును ఆపవద్దంటూ కోరారు. 

అలా ఎవరైనా వస్తే వారు స్టేషనులో దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని..వారిని కచ్చితంగా క్వారంటైన్ లకు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ అలా వచ్చినవారు నిబంధనలు పాటిస్తారని కచ్చితంగా చెప్పలేం. అందుకే మడగావ్ స్టేషన్‌లో రైలు ఆపవద్దని రైల్వే శాఖకు సూచించామని గోవా సీం సావంత్ తెలిపారు. 

ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి గోవాకు వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు వాళ్ల ఇష్టాను రీతిగా వ్యవహరించకూడదనీ..ముఖ్యంగా బీచ్‌ల్లోకి..ఇతర ప్రదేశాలకు అస్సలు వెళ్లవద్దని సూచించారు. 

దేశంలోనే తొలి కరోనా రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది గోవా.  గోవాదాదాపు నెల రోజులుగా గోవాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు క్రమంలో బైట ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతుండటంతో గురువారం నాటికి ఏడుగురికి కరోనా సోకింది. వీరంతా ముంబై నుంచి వచ్చినవారుగా గుర్తించారు. వారిని క్వారంటైన్‌లో ఉంచినట్టు ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు.

Read Here>> మేరీకోమ్ ను సర్ ప్రైజ్ చేసిన ఢిల్లీ పోలీసులు: సెల్యూట్ చేసిన మణిపూర్ మణిపూస