దేవుడైనా చట్టానికి అతీతంగా కాదన్న హైకోర్టు

దేవుడైనా చట్టానికి అతీతంగా కాదన్న హైకోర్టు

చట్టం విషయానికొస్తే దేవుడి భూములైనా సరే న్యాయప్రకారమే పరిష్కరిస్తామని టీఎస్ హైకోర్టు చెప్పింది. వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అల్లిక్ అంజయ్య పిల్‌పై విచారణలో భాగంగా ఈ ఆదేశం ఇచ్చింది. పిటిషనర్ తరపు వాదన ఇలా ఉంది. టీటీడీకి చెందిన టీటీడీకి చెందిన 12గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. దానికి వివరణ ఇస్తూ.. టీటీడీ ఆధీనంలో అదనంగా 12గుంటలు భూమి ఉందని టీఎస్ ప్రభుత్వం తెలిపింది.

పక్కా భూమినీ టీటీడీ ఆక్రమించేందుకు యత్నిస్తోందన్న ఖమ్మం కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు పరిశీలించిన హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుమానస్పదంగా ఉందంటూ పేర్కొంది. భూమి వెనక్కి తీసుకుంటే టీటీడీ స్సందించలేకపోవడంపై హైకోర్టు ప్రశ్నించింది.

ప్రజాప్రయోజనం వెనుక టీటీడీ ఉండొచ్చనే అనుమానాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమినే టీటీడీ ఆక్రమించినట్లు కనిపిస్తోందని తెలిపింది. దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదన్న తెలంగాణ హైకోర్టు
దేవుడైనా చట్టానికి అతీతంగా కాదని తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన భూమి దస్త్రాలు, పట్టాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది టీఎస్ హైకోర్టు.