Godavari Express Derailed: పట్టాలు తప్పినా ఎందుకు పల్టీ కొట్టలేదు? 100కి.మీ వేగంలో ఉన్న రైలు ఒక్కసారిగా ఎలా ఆగింది? గోదావరి ఎక్స్‭ప్రెస్ ప్రమాదంలో కీలక అంశాలు

ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 6 గంటలకు ఘట్కేసర్-బీబీనగర్ సెక్షన్ మధ్యలోని ఎన్ఎఫ్‭సీ నగర్ వద్ద జరిగిన ఘటన ఇది.

Godavari Express Derailed: పట్టాలు తప్పినా ఎందుకు పల్టీ కొట్టలేదు? 100కి.మీ వేగంలో ఉన్న రైలు ఒక్కసారిగా ఎలా ఆగింది? గోదావరి ఎక్స్‭ప్రెస్ ప్రమాదంలో కీలక అంశాలు

Godavari Express derailed near Ghatkesar NFC, you should know some key points

Godavari Express Derailed: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‭ప్రెస్ రైలు బుధవారం ఉదయం హైదరాబాద్ సమీపంలోకి రాగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. భూకంపం వచ్చిందని ప్రయాణికులు అనుకున్నారట. పైన ఉన్న లగేజీ బ్యాగులు కింద పడ్డాయి. ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 6 గంటలకు ఘట్కేసర్-బీబీనగర్ సెక్షన్ మధ్యలోని ఎన్ఎఫ్‭సీ నగర్ వద్ద జరిగిన ఘటన ఇది.

Karnataka BJP chief: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్

రైలుకు చివరలో ఉన్న ఐదు బోగీలు పట్టాలు తప్పినా ఒక్కటంటే ఒక్క బోగీ కూడా పల్టీ కొట్టలేదు. అందుకే పెద్ద ప్రమాదమే తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి కారణం ఆ రైలు బోగీలు అధునాతన సాంకేతికతతో కూడిన ఎల్‭హెచ్‭బీ కోచులు కావడం. ఎల్‭హెచ్‭బీ అంటే.. లింకే హాఫ్‌మన్ బుష్ కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్ యొక్క ప్యాసింజర్ కోచ్. ఈ టెక్నాలజీని జర్మనీకి చెందిన లింకే-హాఫ్‌మన్-బుష్ అభివృద్ధి చేసింది. మన దేశంలోని కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ బోగీలను రూపొందిస్తుంది. ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Delhi: ప్రియురాలిని హతమార్చి ఫ్రిజ్‭లో పెట్టి, కొద్ది గంటల్లోనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు

ఈ బోగీల ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి ప్రమాదం జరిగినా బోగీలు పల్టీ కొట్టవు. ఏ బోగీకి ఆ బోగీ విడిపోతాయి. ఒక బోగీతో మరొక బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ బోగీలను స్టెయిన్‌లెస్ స్టీల్‌, అల్యూమినియంతో తయారు చేస్తారు. ఇక అధునాతన ఎయిర్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల రైలు ఎంత వేగంలో ఉన్నప్పటికీ వెంటనే ఆగిపోతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కూడా గోదావరి ఎక్స్‭ప్రెస్ 100 కిలోమీటర్ల వేగంలో ఉందట. అయినప్పటికీ రైలును వెంటనే ఆపగలిగారు. ఆరు బోగాలకు ప్రమాదం జరిగింది. అందులో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Ram Mandir Defaced: రామమందిరంపై ఇండియాకు మోదీకి వ్యతిరేకంగా రాతలు

ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాదానికి గురైన బోగీలను మినహాయించి రైలును ఉదయమే సికింద్రాబాద్ పంపించారు. మిగిలిన ప్రయాణికులను సైతం వారి వారి గమ్యస్థానాలకు పంపినట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా ట్రాక్ 300 మీటర్ల మేరకు పూర్తిగా దెబ్బతిన్నది. దెబ్బతిన్నంత వరకు కొత్త ట్రాక్ వేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక యంత్రాలతో రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

1,999 pages Love Letter Viral : 23 ఏళ్ల క్రితం భార్యకు 1,999 పేజీల ప్రేమలేఖ రాసిన భర్త .. ఇప్పుడు వైరల్

ఈ ప్రమాదం గురించి 10టీవీతో మేడ్చల్ ఆర్డీవో రవి మాట్లాడుతూ ‘‘గోదావరి ఎక్సప్రెస్ ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే ఇక్కడికి వచ్చాము. రెవెన్యూ అధికారులంతా రావాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం ఐదు బోగిలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన తర్వాత సహక చర్యలు చేపట్టాము. ఐదు బోగిలలో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులందరిని సికింద్రాబాద్‭కు తరలించారు. మరొక రెండు గంటల్లో ట్రాక్ మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంది’’ అని తెలిపారు.