GRMB Meeting : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు కో ఆర్డినేషన్ కమిటీ (జీఆర్ఎంబీ) సమావేశం జరుగనుంది. దీనికంటే ముందు పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయిచారు.

GRMB Meeting : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

Grmb

GRMB Meeting : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు కో ఆర్డినేషన్ కమిటీ (జీఆర్ఎంబీ) సమావేశం జరుగనుంది. దీనికంటే ముందు పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయిచారు. ఈ మేరకు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి తెలంగాణ ఈఎన్ సీ లేఖ రాశారు. దీంతో నేడు హైదరాబాద్ లో జరిగే సమావేశంపై సందిగ్ధత నెలకొంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆ లోపు పూర్తి చేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. దీని కోసం కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రెండు బోర్డుల సమన్వయ కమిటీలు తొలి సమావేశాన్ని నిర్వహించాయి. బోర్డులకు సంబంధించిన ఉద్యోగ నియామకాలు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పై దృష్టి పలు సూచనలు చేశారు. ఈ మేరకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ నిర్ణయించాయి.

ముందుగా బోర్డు మీటింగ్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో కోరింది. ఆ లేఖపై స్పందించిన జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు నిర్దిష్ట గడువులో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. అమలు కార్యాచరణ, గడువులపై సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిపై చర్చించి తగు చర్యలు తీసుకున్న తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.