Hussain Sagar: సన్‌డే ట్యాంక్‌బండ్ దగ్గరకి వెళ్తున్నారా.. ఈ ఆంక్షలు తెలుసుకోండి!

హైదరాబాద్ నగరం ఎప్పటికప్పుడు కొత్త అందాలను తనలో తెచ్చుకొని.. కోటి మందిని తనలో దాచుకొని ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. అభివృద్ధి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లే నగరంలో ఏర్పాట్లను చేయాల్స

Hussain Sagar: సన్‌డే ట్యాంక్‌బండ్ దగ్గరకి వెళ్తున్నారా.. ఈ ఆంక్షలు తెలుసుకోండి!

Hussain Sagar

Hussain Sagar: హైదరాబాద్ నగరం ఎప్పటికప్పుడు కొత్త అందాలను తనలో తెచ్చుకొని.. కోటి మందిని తనలో దాచుకొని ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. అభివృద్ధి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లే నగరంలో ఏర్పాట్లను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తుంటుంది. తాజాగా భాగ్యనగరం పర్యాటకంలో భాగమైన ట్యాంక్ బండ్ నుండి వెళ్లే వాహనాలకు ఆంక్షలు విధించారు.

సహజంగా ఆదివారం నాడు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. వారాంతం కావడంతో ప్రజలు ట్యాంక్ బండ్ మీదకి క్యూ కట్టడం సహజమే. అదే సమయంలో ఆ రోడ్లపై వాహనాల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఇకపై ఆదివారం నాడు ట్యాంక్ బండ్ మీదగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. హుస్సేన్ సాగర్ అందాలను తిలకించడానికి వచ్చే వారి కోసం హైదరాబాద్ పోలీసులు ఈ చర్యలు చేపట్టనున్నారు.

ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వాహనాలను అనుమతించరు. ట్యాంక్ బండ్ మీదకి వచ్చే అవాహనాలను దారి మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ మీదగా వెళ్లే వాహనాలను పీవీ మార్గ్, లోయర్ ట్యాంక్ బండ్ మీదగా వాహనాలను మళ్లించనున్నారు. అలాగే ట్యాంక్ బండ్ మీదకి వెళ్లే వారి వాహనాలకు కూడా బయటే పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.