Goldsikka : హైదరాబాద్‌‌లో బంగారం ఏటీఎంలు రాబోతున్నాయి

రానున్న 45 రోజుల్లోపు నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, ఆబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి 99.99..

Goldsikka : హైదరాబాద్‌‌లో బంగారం ఏటీఎంలు రాబోతున్నాయి

Gold ATM : ఏటీఎంలు అంటే డబ్బులు తీసుకోవచ్చు.. లేదా ఎవరికైనా డబ్బు పంపించేందుకు వినియోగిస్తుంటాం. అయితే.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు బంగారం కోసం ఏటీఎంలు రాబోతున్నాయి. గోల్డ్ సిక్కా (Gold Sikka) అనే కంపెనీ వీటిని తీసుకరాబోతోంది. ఇవి ఎక్కడో కాదు.. హైదరాబాద్ లో వీటిని త్వరలోనే చూడబోతున్నాం. మూడు చోట్ల అందుబాటులోకి తీసుకరానున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ ప్రకటించింది. బేగంపేటలోని సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోల్డ్ సిక్కా సీఈవో సయ్యద్ తరుజ్ మాట్లాడారు.

Read More : OverConfidence: ఆ విషయంలో మహిళల కంటే మగాళ్లకే ఓవర్‌కాన్ఫిడెన్స్ ఎక్కువ!!

రానున్న 45 రోజుల్లోపు నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, ఆబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి 99.99 శాతం స్వచ్చత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారం నాణాలు డ్రా చేసుకోవచ్చన్నారు. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ కార్డులను కూడా జారీ చేస్తామని, బంగారం ధరలు ఏటీఎం తెరలపై కనిపిస్తాయన్నారు. నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయని వెల్లడించారు. ఒక్కో మిషన్ లో దాదాపు రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల బంగారం కాయిన్ లను లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు గోల్డ్ ఏటీఎంలు పని చేస్తాయన్నారు. ఇలాంటి ఏటీఎంలు బ్రిటన్, దుబాయ్ లో మాత్రమే ఉన్నాయి.