Gold Pot: రైతు పొలంలో లంకె బిందెలు..

Gold Pot: రైతు పొలంలో లంకె బిందెలు..

Gold Pot

Gold Pot: ఎప్పుడూ లంకె బిందెల గురించి మాట్లాడడమే కానీ.. చూడడం చాలా అరుదు.. ఇప్పుడు అదే అవకాశం దక్కింది జనగామ జిల్లా వాసులకు. ఓ రైతు పొలంలో లంకె బిందెలు దొరికాయి. ఐదు కిలోల బంగారం లంకె బిందెల్లో దొరకగా.. జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాన్ని చదును చేస్తుండగా.. లంకెబిందెలు ఓ రైతుకు దొరకగా.. వెంటనే విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

పెంబర్తి గ్రామంలోని రైతు భూమిలో లంకె బిందె బయటపడగా.. భూమిని చదును చేసి వెంచర్ చేద్దామని అనుకున్న యజమానులు.. లంకె బిందె దొరికినట్లు వెల్లడించారు. అది నిజంగా లంకె బిందెనేనా అని ఒకటికి రెండు సార్లు పరిశీలించారు.

లంకె బిందె వార్త చుట్టు పక్కల వారికి కూడా తెలియడంతో.. దానిని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం అక్కడికి చేరుకున్నారు. లంకె బిందెలకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు.

అయితే గతంలోనూ ఈ ప్రాంతానికి సమీపంలో లంకె బిందెల కోసం కొందరు తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో శివ లింగం దాగి ఉందని చెప్పడంతో ఎంత వెతికినా అది దొరకలేదు. అయితే ఇప్పుడు మాత్రం దేవతా మూర్తులకు సంబంధించిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.