Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల గుడ్ న్యూస్.. క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్

తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ..

Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల గుడ్ న్యూస్.. క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్

Contract Employees

Contract Employees : తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ చేయటానికి జీవో నెంబర్ 16ను నిలిపి వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. తాజాగా ఈ పిల్ నంబర్ 122/2017 ను కొట్టి వేసింది కోర్టు. అలాగే ఈ పిటిషన్ వేసిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా వేసింది.

Girl Students Drugged Molested : స్కూల్‌లో ఘోరం… 17మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి

క్రమబద్దీకరణకు అనుకూలంగా వాదించింది ప్రభుత్వం. ఈ క్రమబద్ధీకరణకు 2016లో జీవో 16 జారీ చేసింది ప్రభుత్వం. కానీ ఈ జీవో 16పై హైకోర్టులో నిరుద్యోగి జె.శంకర్ 2017లో పిల్ దాఖలు చేసారు. అయితే ఈ జీవోపై గతంలో స్టే ఇవ్వడంతో నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియకు.. ఇప్పుడు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆ పిల్ కొట్టివేయడంతో లైన్ క్లియర్ అయ్యింది.