DA Hiked : ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. డీఏ పెంపు ఉత్తర్వులు జారీ

ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తంచనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్ లో జమ కానుంది.

DA Hiked : ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. డీఏ పెంపు ఉత్తర్వులు జారీ

Da Hiked

DA Hiked : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తంచనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్ లో జమ కానుంది. 2021 జూలై నుంచి బకాయిలను జీపీఎఫ్ లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లింపుకు కేబినెట్ ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల (కరువు భత్యం) కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఆ మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌డంతో ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేశారు.

CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు

కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా డీఏల చెల్లింపులో జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు నిన్న మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.