Police Recruitment: గర్భిణి అభ్యర్థులకు శుభవార్త.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే మెయిన్స్ పరీక్షకు అనుమతి
ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే నేరుగా, మెయిన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Police Recruitment: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న గర్భిణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ టెస్టులో అర్హత సాధించిన గర్భిణి అభ్యర్థులు, ప్రస్తుతం జరుగతున్న ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరవ్వాల్సిన అవసరం లేదు.
Russia: జీ7 దేశాలకు రష్యా షాక్.. ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేత
ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే నేరుగా, మెయిన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిజికల్ ఈవెంట్స్ నుంచి ప్రస్తుతానికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. ముందుగా మెయిన్స్ పరీక్ష రాయాలి. అందులో అర్హత సాధిస్తే, ఆ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ కూడా పాసవ్వాల్సి ఉంటుంది. ఈ మినహాయింపు పొందాలంటే దీనిపై అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీకి లేఖ రాసి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొని, అర్హత సాధించాల్సి ఉంటుంది. ముందుగా అండర్‌టేకింగ్ ఇచ్చినవారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది.
అలా లేని వారిని ఈ విధానంలో అనుమతించరు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ రాసుకోవచ్చు. ఈ ఈవెంట్స్ మరో 9 రోజుల్లో పూర్తవుతాయని, ఇప్పటికే 70 శాతం ఈవెంట్స్ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈవెంట్స్ పూర్తైన వెంటనే మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన ఫిజికల్ ఈవెంట్స్‌లో 54 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.