ST Reservations : ఎస్టీలకు ప్రభుత్వం శుభవార్త.. రిజర్వేషన్ల శాతం పెంపు

ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ST Reservations : ఎస్టీలకు ప్రభుత్వం శుభవార్త.. రిజర్వేషన్ల శాతం పెంపు

ST Reservations : ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు దృష్ట్యా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. పెంచిన రిజర్వేషన్ల మేరకు రోస్టర్ లో మార్పులు చేసింది. దీంతో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇకపై నియామకాల్లో ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది.

తెలంగాణలో షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 33 జారీ చేసింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోని తీసుకుని.. వారికి రిజర్వేషన్లు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియమాకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్టీలకు 10, ఎస్సీలకు 15, బీసీలకు 29, ఈడబ్ల్యూఎస్‌‌కు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు 6శాతంగా ఉన్న రిజర్వేషన్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ఉంచారు. అలాగే.. రిజర్వేషన్ల పెంపు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికకు 2017లో తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.