Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే ఉద్యోగాల భర్తీ , నోటిఫికేషన్లు

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.

Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే ఉద్యోగాల భర్తీ , నోటిఫికేషన్లు

Jobs

Telangana Govt Jobs : తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు ఆర్థిక శాఖ తుది నివేదికను సైతం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. కేబినెట్ ఆమోద ముద్ర పడితే త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముంది.

Read More : Telangana : వచ్చే 20 ఏళ్లు..అధికారంలో టీఆర్ఎస్

50 వేల పోస్టులు : 
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాఖల్లో సుమారు 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉద్యోగ ఖాళీలను రెండు విభాగాలను ఏర్పాటు చేసి గుర్తించారు. ఆ వివరాలన్నింటిని T.S.P.S.C కి పంపించారు. అయితే T.S.P.S.C పాలక వర్గం ఏర్పాటు అయ్యాక జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. ఇప్పుడు కేంద్రం కొత్త జోన్లకు క్లియరెన్స్ ఇవ్వడంతో ఉద్యోగాల భర్తీకి ముందడుగు పడింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు గుర్తించి కేబినెట్‌కి నివేదించారు.

Read More :Old Athlete: వయసు 74 ఏళ్ళు.. యువకులతో పరుగు పందెం!

సమగ్ర సమాచారం ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ :-
ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి. గత మంత్రిమండలి భేటీలో ముసాయిదా నివేదిక ఇచ్చాయి. ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం సూచించడంతో.. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67 వేల 820 ఖాళీలు తేలాయి. పూర్తి జాబితాను త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్థిక శాఖ సమర్పించనుంది. తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీ నివేదిక ప్రకారం లక్ష 91 వేల పైగా ఖాళీలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో దాదాపు 67 వేల 820 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Read More : Taliban : మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలి

త్వరలోనే నోటిఫికేషన్లు : –

వివిధ శాఖల్లో 45 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇతర సంస్థల్లో 20 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని సీఎంకు తెలిపారు. భర్తీ చేయాల్సిన వాటిలో అత్యధిక శాతం పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలోనే అని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 37 వేల 820 ఖాళీలు ఉండగా.. ఇప్పుడు 19 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖలో 12 వేల 961, విద్యాశాఖలో 9 వేల 600, గురుకులాల్లో 12 వేల 436, వైద్య ఆరోగ్యలో 8 వేల 347 పోస్టులతో పాటు సింగరేణి, ఆర్టీసీ, రెవిన్యూ, రవాణా, ఎక్సైజ్‌ శాఖలో ఖాళీలను సీఎంకు వివరించారు. మొత్తం పోస్టుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలను మినహాయించి మిగతా వాటిని ఖాళీలుగా ప్రకటించనున్నారు. అతి త్వరలో మొత్తం 50 వేల పోస్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు.