TSRTC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ చెల్లింపు

ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

TSRTC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ చెల్లింపు

TSRTC

Good News For TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్బంగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ నెల వేతనంతో కలిపి డీఏ చెల్లించనుంది.

ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు.

Jammu And Kashmir : జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు అరెస్టు

2011లో దాదాపు 29 రోజులపాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

క్లిష్ట పరిస్ధితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.