Gold price today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మాత్రం.. |Good news for women .. reduced gold price ..

Gold price today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మాత్రం..

తెలుగు రాష్ట్రాల్లో పెండ్లిళ్ల సీజన్‌ కొనసాగుతోంది. ఒక్క మే నెలలోనే వేలాది జంటలు ఒక్కటి కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. వివాహం అంటే ముఖ్యంగా బంగారం కొనుగోలు ఎక్కువగానే ఉంటుంది. మహిళలు గోల్డ్ షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో...

Gold price today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మాత్రం..

Gold price today: తెలుగు రాష్ట్రాల్లో పెండ్లిళ్ల సీజన్‌ కొనసాగుతోంది. ఒక్క మే నెలలోనే వేలాది జంటలు ఒక్కటి కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. వివాహం అంటే ముఖ్యంగా బంగారం కొనుగోలు ఎక్కువగానే ఉంటుంది. మహిళలు గోల్డ్ షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో వారికి ఇది శుభవార్తే. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారానికి అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో.. దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గడిచిన వారం రోజుల్లో బంగారం రూ. వెయ్యి వరకు తగ్గింది. మరోవైపు వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది.

Gold Rate 1

ఆదివారం బిలియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గడంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 46,250గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450కు పడిపోయింది. అయితే గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఆదివారం మార్కెట్ ధరల ప్రకారం.. కేజీ వెండి 63,700కు చేరింది. రూ. 300 పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి బులియన్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి.

Gold Rate 02

ఈ వారం ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 47,500గా ఉంది. అయితే ప్రస్తుతం రూ. 46,250కి పడిపోయింది. వారంలో రూ. వెయ్యి తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం వారం ప్రారంభంలో రూ. 51, 810 పలికింది. తాజాగా రూ. 50,450కి తగ్గింది. వారంలో రూ. 1,360 బంగారం ధర తగ్గింది. వెండి ధర వారంలో రూ. 2,800 మేర పడిపోయాయి.

×