MLA Rajasingh’s Wife Petition In High Court : హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి..బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ... రాజసింగ్ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

MLA Rajasingh’s Wife Petition In High Court : హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి..బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌

MLA Rajasingh's wife petition in High Court

MLA Rajasingh’s Wife Petition In High Court : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ… రాజసింగ్ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అటు పీడీ యాక్ట్ నమోదు కావడంతో రాజాసింగ్‌ గత కొన్ని రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్నారు.

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. రాజాసింగ్‌ను ఆయ‌న ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నేరుగా నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు. రాజాసింగ్‌కు న్యాయ‌మూర్తి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించగా.. పోలీసులు రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకి తరలించారు.

MLA Rajasingh PD Act Case : పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ యత్నాలు .. మీరు హైకోర్టుకెళితే మేం సుప్రీంకోర్టుకు వెళతామన్న సీపీ ఆనంద్

పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో విద్వేషాలు రెచ్చగొట్టారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించారని పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టారు. రాజాసింగ్ పై 2004 నుండి 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి.

చర్లపల్లి జైల్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అధికారులు భద్రత పెంచారు. రాజాసింగ్‌ను మానస బ్యారక్‌ నుంచి శారద బ్యారక్‌కు మార్చారు. అటు రాజాసింగ్‌ను కలిసేందుకు వచ్చినవారిని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.