Government Jobs : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్

ఇప్పటికే పలు ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న..

Government Jobs : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్

Government Jobs

Government Jobs : ఇప్పటికే పలు ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,663 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భ‌ర్తీ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) ద్వారా నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, భూగ‌ర్భ జల శాఖ‌లో 88 ఖాళీలు, డైరెక్ట‌ర్ ఆప్ వ‌ర్క్స్ అకౌంట్స్‌లో 53 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాల‌కు సంబంధించి త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేయనుంది.

Telangana Jobs : నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం మ‌రో శుభవార్త

తెలంగాణలో 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు.. ఇప్పటివరకు 45వేల 325 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన విషయం విదితమే. పోలీసు, అటవీ, ఫైర్, జైళ్లు, రవాణ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.

Telangana Jobs : తెలంగాణలో మరో 1433 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ (అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్) లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఆర్ అండ్ బీ, ఎన్.హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ఆర్ యూబీఎస్, హెచ్ వోడీ) లో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ HODలో 53, డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ (HOD)లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం అనుమతులు ఇచ్చిన 1663 ఖాళీలతో కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం 46వేల 998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను సైతం ఆయా నియామక సంస్థలు విడుదల చేశాయి. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుందని సమాచారం.