CJI NV Ramana-Governor: రాజభవన్‌లో సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ విందు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హైదరాబాద్‌కు వచ్చారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. సీజేఐ గౌరవర్థం గవర్నర్ తమిళ సై రాజభవన్‌లో విందును ఏర్పాటు చేశారు.

CJI NV Ramana-Governor: రాజభవన్‌లో సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ విందు

Governor Tamilisai Gives Dinner To Cji Nv Ramana In Raj Bhavan

Governor Tamilisai Dinner to CJI NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హైదరాబాద్‌కు వచ్చారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. సీజేఐ గౌరవర్థం గవర్నర్ తమిళ సై రాజభవన్‌లో విందును ఏర్పాటు చేశారు. ఎన్వీ రమణ రాకతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాజభవన్ కు చేరుకున్నారు. గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు కేసీఆర్ కూడా హాజరయ్యారు.

అంతకుముందు తిరుపతి నుంచి హైదరాబాద్ కు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లారు. రాజ్ భవన్ వద్ద సీఎం కేసీఆర్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్వీ రమణ ఈ రాత్రికి రాజ్ భవన్ లోనే బసచేస్తారు.

అంతకుముందు రోజున ఎన్వీ రమణ దంపతులు తిరుపతిలో పర్యటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. తిరుమలకు వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.