Governor Tamilisai : తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు

తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు.

Governor Tamilisai : తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు

Governor Tamilisai

Governor Tamilisai : తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు. పుదుచ్చేరిలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం లేకుండా రిపబ్లిక్ డేను నిర్వహించిందని పేర్కొన్నారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పాటించలేదన్నారు.

ప్రభుత్వ తీరును హైకోర్టు ఖండించినా..పరేడ్, రిపబ్లిక్ డేను నిర్వహించాలని చెప్పినా.. పట్టించుకోలేదన్నారు. సమయా భావాన్ని కారణంగా చూపించి రాజ్ భవన్ కే రిపబ్లిక్ డే వేడుకలను పరిమితం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సాకుతో రిపబ్లిక్ డే వేడుకలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఖమ్మం సభలో లేని కరోనా రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిందా అని ప్రశ్నించారు. అటు రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వస్తారని తాను ఆశించలేదన్నారు. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉందని తెలిపారు.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే లేఖ రాశానని.. కానీ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే తనకు సమాధానం ఇచ్చిందని తెలిపారు. ఈ సారి రిపబ్లిక్ డేను రాజ్ భవన్ లోనే చేసుకోవాలని చెప్పిందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ మాత్రమే హాజరవుతారని అందులో ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక పంపుతానని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి తాను రిపోర్టు పంపించానని పేర్కొన్నారు.