TS Governor Tamilisai : ‘మహిళా గవర్నర్ ని అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు’

మహిళా గవర్నర్ అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు అని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తంచేశారు.

TS Governor Tamilisai : ‘మహిళా గవర్నర్ ని అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు’

Ts Governor Tamilisai Soundararajan

ప్రధాని మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళసై భేటీ అయ్యారు. బుధవారం తమిళిసై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయన తరువాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘తనను వ్యక్తిగతంగా అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి తెలంగాణ ప్రభత్వం మర్యాద ఇవ్వాలని సూచించారు తమిళిసై. మహిళా గవర్నర్ ను కాబట్టి అవమానిస్తున్నారని.. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించా నని..చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశానని తెలిపారు.

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలి : తమిళిసై
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలి అని ఈ సందర్భంగా తమిళిసై సూచనలు చేశారు. వరంగల్ ఆస్పత్రిలో వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి

గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది నా విచక్షణాధికారం : తమిళిసై
హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పేరుకు సిపారస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. దీని గురించి కూడా తమిళిసై మాట్లాడుతూ..గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది నా విచక్షణాధికారం అని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి పేరు సిఫారసు పైన నేను సంతృప్తి చెందలేదని..గతంలో ముగ్గురి విషయంలో ఆమోదం తెలిపానన్నారు.ఈ విషయంలో నేనేమీ వివాదాస్పదం చేయలేదు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.

సాకు చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదు
ఈ కారణాలు సాకు చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదన్నారు. అధికారులను సైతం హాజరు కాకుండా, ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా?
అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకూడదు. గవర్నర్ గా ఎవరన్నా సరే, ఆ పదవిని గౌరవించాలని తెలుసుకోవాలని సూచించారు. ఉగాది సందర్భంలో కూడా నేను సీఎం కేసీఆర్ తో సాహా అందరికి ఆహ్వానాలు పంపాను. నేను ఎవరినీ ఇగ్నోర్ చేయలేదు. నాకు ఈగో లేదు అని గవర్నర్ తమిళిసై స్పష్టంచేశారు.

నేను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలి
అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయంకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి మీకు అందరికీ తెలుసు ..దాని గురించి ప్రత్యేకించి అటు ప్రధానికి చెప్పాల్సిన పనిలేదని అన్ని ఆయనకు తెలుసు అన్ని అన్నారు. నేనేమీ వివాదాస్పదం చేయలేదు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను

నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. అందరితో స్నేహంగా ఉంటాను..నేను చాలా పారదర్శకంగా ఉంటాను. నేను ప్రజలతో, ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటానుని అన్నారు.
ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలి అన్నారు. నన్ను కాదు, గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలని సూచించారు. అయినా సరే, నేను వేటినీ పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై.

సీఎం ఏ విషయం పైన అయినా నాతో నేరుగా వచ్చి చర్చించవచ్చు అని..కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలియజేయటానికే ఓ డాక్టర్ గా ప్రధానికి కలిసాను తప్ప మరేమి లేదు అని తెలిపారు. పుదుచ్చేరి – తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని ప్రధాని మోడీని కోరాననీ.. ట్రైబల్ గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి మాట్లాడానని..గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.