ప్రభుత్వం టార్గెట్ ఇదే : జూలై ఆఖరులోగా 10 మిలియన్ల టెస్టులు.. 20 రాష్ట్రాల్లో ప్రొటోకాల్

  • Published By: srihari ,Published On : May 18, 2020 / 09:08 AM IST
ప్రభుత్వం టార్గెట్ ఇదే : జూలై ఆఖరులోగా 10 మిలియన్ల టెస్టులు.. 20 రాష్ట్రాల్లో ప్రొటోకాల్

కరోనా కష్టకాలంలో భారతదేశం లాక్ డౌన్ 4.0లోకి అడుగు పెట్టింది. వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం కావడంతో ఆ దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. అందుకే లేటెస్ట్ యాక్షన్ అమలు చేయబోతోంది ప్రభుత్వం. జూలై చివరి నాటికి 10 మిలియన్ల మందికి టెస్టులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనపు సౌకర్యాలను అందించనుంది. కరోనాను కట్టడి చేసేందుకు 20 కీలకమైన రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ప్రోటోకాల్‌ అమల్లోకి తేనుంది. ఆగస్టు వరకు ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ముంబై, ఢిల్లీ, ఇండోర్, పుణె, భూపాల్, చెన్నై సహా 20 నగరాలను గుర్తించింది. వీటితోపాటు ఇతర నగరాల్లోనూ ఇదే తరహా విధానంతో గుర్తించనుంది. జూన్ మొదటివారంలోనే ఆయా నగరాల్లో టెస్టింగ్ వ్యూహాంపై సమగ్రమైన సమీక్షను కేంద్రం నిర్వహించనుంది. ప్రొటోకాల్ అనుగుణంగా మరిన్ని టెస్టులను నిర్వహించనుందవి. జూలై ముందుగానే రివ్యూ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కరోనా కేసుల తీవ్రతకు కీలకమైన జూలై నెలలోగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా రంగం సిద్ధం చేస్తోంది. అంతర్గత ప్రభుత్వాల సాయంతో జూలై ఆఖరు నాటికి 5లక్షల నుంచి 7లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతయని అంచనా వేస్తోంది.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందుగానే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్ సపోర్ట్ సిస్టమ్స్ సేకరణ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా భారీగా పెరిగిపోతూ ఆగస్టు చివరి నాటికి 8 లక్షల నుంచి 1 మిలియన్ (10 లక్షలు) వరకు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం 91వేల కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు సుమారుగా 4వేల నుంచి 5వేల వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తూర్పు వలస కార్మికులైన తిరిగి వస్తున్న క్రమంలో బీహార్, ఒడిషాలో మూడు వంతుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇలా వలస వచ్చిన వారితో గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మే 15 నాటికి డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల పాజిటివ్ రేషియో సగటున 4.3 శాతంగా నమోదైంది. మహారాష్ట్రలో 11.9శాతంతో అందోళనకరంగా ఉంది. ఢిల్లీలో 9.0శాతం, గుజరాత్ లో 7.8శాతం, చత్తీస్ గఢ్‌లో 6శాతం, తెలంగాణలో 5.4శాతం, మధ్యప్రదేశ్‌లో 4.9శాతం, పశ్చిమ బెంగాల్‌లో 4.6 శాతంగా నమోదయ్యాయి. రాబోయే పక్షం రోజుల్లో భారతదేశం యాంటీ బాడీ టెస్టు ప్లాన్ నుంచి ELISA టెస్టింగ్ మెకానిజానికి మారిపోనుంది. దేశంలోని ప్రతి మెడికల్ కాలేజీలో మాలిక్యులర్ డయాగ్నిస్టిక్ ల్యాబ్ నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసేపనిలో నిమగ్నమైంది. 

Read: ఆరుగురు ఒప్పో ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ ఫ్యాక్టరీ