Tombs : తెల్లారేసరికి వ్యవసాయ భూమిలో సమాధులు

ఈ ఘటన జిల్లాలోని పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రాత్రికి రాత్రే రెండు సమాధులు వెలవడంతో భూ యజమానికి స్థానికులు సమాచారం అందించారు.

Tombs : తెల్లారేసరికి వ్యవసాయ భూమిలో సమాధులు

Tombs

Tombs :  వికారాబాద్ జిల్లాలోని ఓ వ్యవసాయ పొలంలో తెల్లారేసరికి సమాధులు వెలిశాయి. ఈ ఘటన జిల్లాలోని పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రాత్రికి రాత్రే రెండు సమాధులు వెలవడంతో భూ యజమానికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో పొలం వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ పొలం యజమాని. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంబంధిత అధికారుల సమక్షంలో సమాధులను తవ్వి చూశారు. అయితే అందులో మృతదేహాలకు సంబందించిన ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు.

చదవండి : Telangana : పొలం దున్నుతుంటే బైటపడ్డ రాతికాలంనాటి సమాధులు..రాతి చిప్పలు

గ్రామానికి సమీపంలోని ఈ భూమిని కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కి చెందిన వ్యాకులు కొనుగోలు చేశారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సమాధులను పూర్తిగా తొలగించిన అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యజమానికి స్థానికంగా ఎవరైనా గిట్టని వారు ఉన్నారా? ఉంటే ఇది వారిపనేనా అనే కోణం విచారణ చేపట్టారు.

చదవండి : Vikarabad : మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై : విప్లవాత్మకమైన చర్య – సింధియా