సంగారెడ్డిలో దారుణం..శ్మశానమే కరోనా ఐసోలేషన్ కేంద్రం

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 11:04 AM IST
సంగారెడ్డిలో దారుణం..శ్మశానమే కరోనా ఐసోలేషన్ కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన వారిని సమాజం నుంచి వెలేసినట్లుగా..శ్మశానంలో ఉంచడాన్ని కలకలం రేపింది. కల్హేర్ మండలంలోని ఖానాపూర్ తండాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.



వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉంది. వీరు హోం ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచించారు. వీరి వల్ల ఎక్కడ తమకు కరోనా సోకుతుందోమోనన్న భయం అక్కడి వారిలో నెలకొంది. గ్రామంలో ఉండవద్దని సూచించారు.

దీంతో చేసేది ఏమీ లేక…స్థానికంగా ఉన్న శ్మశానానికి వారిని తరలించారు ఆసుపత్రి సిబ్బంది. ట్యాబ్లెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, తమకు చికిత్స అందించాలని రోగులు కోరుతున్నారు.



స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొంత గ్రామం ఇది. కరోనా రోగులు గ్రామంలో ఉండకూడదని తీర్మానం చేశారు. దీంతో శ్మశానాన్నే ఐసోలేషన్ గా మార్చివేశారు. చనిపోయిన తర్వాత..దహన సంస్కారాలు..అనంతరం స్నానాలు చేసే బాత్ రూంలోనే వైరస్ సోకిన మహిళ…ఉండగా..ఇద్దరు పురుషులు ఆరు బయటే ఉన్నారు.

దీనిపై డీఅండ్ హెచ్ ఓ అధికారులతో 10tv మాట్లాడింది. ఇంటికే తరలిస్తున్నామని వారు చెప్పారు. ముగ్గురిని వారి వారి నివాసాలకు తరలించారు.