Groom Died : తెల్లారితే పెళ్లి.. విద్యుత్ షాక్ తో వరుడు మృతి

పెద్ద కొడుకు యాకూబ్(21) హైదరాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో యాకూబ్ కు వివాహం కుదిరింది.

Groom Died : తెల్లారితే పెళ్లి.. విద్యుత్ షాక్ తో వరుడు మృతి

Groom Died

Groom Died : పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ఒక రోజు ముందు విద్యుత్ షాక్ తో పెళ్లి కొడుకు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమ్ముగూడెం తండాకు చెందిని భూక్యా బాలాజీ, కాంతి దంపతులకు ఇద్దరు పిల్లలు.

పెద్ద కొడుకు యాకూబ్(21) హైదరాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో యాకూబ్ కు వివాహం కుదిరింది. పెళ్లి కోసం యాకూబ్ సెలవులపై ఇంటికి వచ్చాడు.

Bride Groom Died : పెళ్లైన మూడో రోజే.. గుండెపోటుతో వరుడు మృతి

శుక్రవారం పెళ్లి జరగాల్సివుండగా ఇంట్లో బంధువులతో పెళ్లి సందడి నెలకొంది. గురువారం ఇంట్లో నీళ్లు అయిపోవడంతో బోర్ మెటర్ స్విచ్ వేస్తున్న క్రమంలో యాకూబ్ విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయాడు.

వెంటనే బంధువులు, స్థానికులు చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే యాకూబ్ మృతి చెందాడు. తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృతి చెందడంతో రెండు కుటుంబాలు విషాదఛాయలు అలుముకున్నాయి.