Khammam : బిల్డర్లు, మేస్త్రీలకు జీఎస్టీ అధికారుల వేధింపులు..10టీవీ చేతిలో కీలక ఆధారాలు

ఖమ్మం జిల్లాలో జీఎస్టీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. జీతం కంటే గీతం ముఖ్యమంటూ.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. బిల్డర్లను వేధింపులకు గురిచేస్తున్నారు.

Khammam : బిల్డర్లు, మేస్త్రీలకు జీఎస్టీ అధికారుల వేధింపులు..10టీవీ చేతిలో కీలక ఆధారాలు

Gst

GST officials harassing : ఖమ్మం జిల్లాలో జీఎస్టీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. జీతం కంటే గీతం ముఖ్యమంటూ.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. బిల్డర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలంటూ గ్రానైట్, చాంబర్ ఆఫ్‌ కామర్స్ వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. జీఎస్టీ కట్టినా సరే వదలట్లేదు. ఏదో ఒక వంక చూపించి నోటీసులు ఇస్తున్నారు. ఫైన్ చెల్లించాలంటూ కాల్స్‌ చేసి వేధిస్తున్నారు. తమ వాటా ఎక్కడ అని మొహమాటం లేకుండా మొహంమీదే అడిగేస్తున్నారు. ఆ అవినీతి అక్రమార్కులకు ఖాకీలు కూడా తోడవడంతో బాధితులకు బాధలు తప్పడంలేదు.

వ్యాపారుల అకౌంట్‌లో డబ్బులుంటే చాలు జీఎస్టీ అధికారులు వాలిపోతున్నారు. డబ్బులున్నాయిగా.. మరి మా సంగతేంటి అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారు. అంతేకాదు… మీ జోలికి రావద్దంటే లంచం ఇవ్వాలని లేదంటే ఫైన్ తప్పదని ఆఫర్‌ ఇస్తున్నారు. అయితే.. ఓవైపు వారు అడిగినంత చెల్లించినా ఫైన్‌ కట్టక తప్పడంలేదంటున్నారు బాధితులు.

Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు

నూకల రాంమోహన్‌ రెడ్డి అనే బిల్డర్‌ను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు జీఎస్టీ సూపరింటెండెంట్ ప్రసాద్. చివరికి 6 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇక అప్పట్నుంచి బిల్డర్‌కు ప్రతిరోజు ఫోన్లు. డబ్బులు ఎక్కడ? ఎప్పుడు ఇస్తావంటూ ప్రశ్నలు. జీఎస్టీ అధికారుల ఒత్తిడి తాళలేక బిల్డర్ నూకల రాంమోహన్ రెడ్డి 10టీవీని ఆశ్రయించాడు. దీంతో ఆ అధికారి బాగోతం బట్టబయలైంది.

బిల్డర్‌ రాంమోహన్‌ రెడ్డితో జీఎస్టీ అధికారి జరిపిన కాల్ సంభాషణ వింటే వారి కలెక్షన్ ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజే అమౌంట్‌ అంతా పే చేయాలన్నాడు. కష్టం సార్‌ అంటే నెక్స్ట్ టైమ్ ఫిక్స్ చేశాడు. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందకపోవడంతో.. ఆ అధికారి మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేశాడు. డబ్బులు ఎక్కడని అడిగాడు. ఫీవర్‌గా ఉంది అని చెబితే కాస్త కనికరించి సాయంత్రం వరకు టైమిచ్చాడు. అయినా క్యాష్ చేతిలో పడకపోవడంతో బిల్డర్‌కు మరోసారి జీఎస్టీ అధికారి ప్రసాద్ కాల్‌చేశాడు. ఈసారి ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫర్లు ప్రటించాడు.

Vikramarkudu 2: దర్శకుడే కాదు హీరో కూడా మార్పు తప్పదా?

ఆఖరికి 40వేల రూపాయలు సమర్పించుకున్నానని… అయినా ఫైన్ అంతే ఉందని బిల్డర్ రాంమోహన్ రెడ్డి వాపోతున్నాడు. బాధితుడు రాంమోహన్ రెడ్డి దీనిపై రాష్ట్ర జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రసాద్‌ వేధింపుల గురించి లెటర్‌ రాశాడు. అయినా అతడికి న్యాయం జరగలేదు.
బిల్డర్లనే కాదు.. మేస్త్రీలను కూడా అక్రమార్కులు వదలట్లేదు. జీఎస్టీ కట్టాలంటూ వేధిస్తున్నారు.

బిల్డర్ల దగ్గర పనిలేక ఖాళీగా ఉన్న సమయంలో తాము కట్టిన ఇళ్లకు కూడా జీఎస్టీ అడుగుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. జీఎస్టీ అధికారుల వేధింపులతో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని బాధితుడు రాంమోహన్‌ రెడ్డి వాపోతున్నాడు. ఎలాగోలా కొన్ని డబ్బులు చెల్లించినా ఫోన్లలో వేధిస్తున్నారని చెబుతున్నాడు.