Gutta Sukhender Reddy : కాంగ్రెస్‌కు అధికారంఇస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరే.. ప్రజలు వాస్తవికంగా ఆలోచించాలి

మధిర నియోజకవర్గం తప్ప బయట విషయాలపై భట్టి విక్రమార్క‌కు అవగాహన లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరో తెలుసుకోవాలని సూచించారు.

Gutta Sukhender Reddy : కాంగ్రెస్‌కు అధికారంఇస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరే.. ప్రజలు వాస్తవికంగా ఆలోచించాలి

Gutta Sukhender Reddy

Gutta Sukhender Reddy : కాంగ్రెస్‌ (Congress) కు అధికారం వస్తే తెలంగాణ (Telangana) కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress party) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాదయాత్రలు వాళ్ళ పార్టీలో ఆధిపత్య పోరుకోసం కొనసాగుతున్న యాత్రలు, అవి ప్రజలకోసం సాగుతున్నవి కాదు అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకుముందు బండి సంజయ్ (Bandi Sanjay), ఇప్పుడు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాదయాత్రలతో ప్రజలను మభ్య పెడుతున్నారంటూ గుత్తా విమర్శించారు. డిండి ప్రాజెక్ట్ కింద రెండు పంటలకు నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఎస్సెల్బిసి టన్నెల్ వైఎస్ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ దివాళా తీసి పనులు నిలిచి పోయాయి, అనేక సాంకేతిక సమస్యలు అవరోధంగా మారాయి. అవన్నీ దాటుకొని సీఎం కేసీఆర్ పనులు చేయిస్తున్నారని గుత్తా చెప్పారు.

Revanth Reddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై రేవంత్ రెడ్డి స్పందన

2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని భట్టి విక్రమార్క అడుగుతున్నారు. అసలు భట్టి విక్రమార్క తెలివి ఉండి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ చట్టం కంటే మెరుగైన పరిహారం నిర్వాసితులకు అందిస్తున్నారని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల మీద NGT‌లో కేసులు వేయించింది కాంగ్రెస్ వారేనని అన్నారు. కాంగ్రెస్ వదిలేసిన పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ దశలవారీగా సీఎం కేసీఆర్ పూర్తి చేస్తున్నారని అన్నారు. గతేడాది కంటే రెండింతలు జిల్లాలో ధాన్యం సేకరణ జరిగింది.అంటే సాగు నీరు పెరగకుండానే ధాన్యం దిగుబడి పెరిగిందా? అని గుత్తా ప్రశ్నించారు.

Mallu Batti Vikramarka : తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?.. ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించిన మల్లు భట్టి విక్రమార్క

మధిర నియోజకవర్గం తప్ప బయట విషయాలపై భట్టి విక్రమార్క‌కు అవగాహన లేదని గుత్తా ఎద్దేవా చేశారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరో తెలుసుకోవాలని భట్టికి సూచించారు. ఎలా అధికారంలోకి రావాలనే యావ తప్ప ప్రతిపక్ష నేతలకు అభివృద్ధి పట్టదని అన్నారు. కాంగ్రెస్‌కు అధికారంవస్తే తెలంగాణ కుక్కల చింపిన విస్తరి అని మరోమారు ఘంటాపథంగా చెబుతున్నానని అన్నారు. మీలో ఐక్యత లేదుగానీ.. ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

Congress vs BJP: విదేశాల్లో రాజకీయాలొద్దన్న విదేశాంగ మంత్రి జైశంకర్‭కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

నేను ఏ హోదాలో ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారం‌పై దృష్టి పెట్టాను తప్పితే మీలా ఆరోపణలు చేసుకుంటూ కూర్చోలేదని గుత్తా అన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా చేసిన పనులు, చేయబోయే పనులు చెబుతున్నామని, ప్రజలు వాస్తవికంగా ఆలోచించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ధరణి‌లో స్థానికంగాఉన్న ఇష్యుస్ వల్ల సమస్యలుతప్ప పై‌స్థాయిలో లేవని అన్నారు. దాదాపు 90శాతం భూ సమస్యలు ధరణి వల్ల పరిష్కారం అయ్యాయని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.