H3N2 Virus : బీ కేర్‌ఫుల్.. తెలంగాణను భయపెడుతున్న H3N2 వేరియంట్, పెరుగుతున్న కేసులు

తెలంగాణలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

H3N2 Virus : బీ కేర్‌ఫుల్.. తెలంగాణను భయపెడుతున్న H3N2 వేరియంట్, పెరుగుతున్న కేసులు

H3N2 Virus : తెలంగాణలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఫ్లూ సోకితే దగ్గు, తుమ్ములు, శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. కోవిడ్ తరహాలో ఇది కూడా తుంపర్ల ద్వారానే ఇతరులకు సోకుతోందని, జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరించారు. ప్రజలు తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పది మందిలోకి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. వృద్ధులు, గర్బిణులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Also Read..H3N2 virus : దేశంలో భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలేంటో తెలుసా?

రాష్ట్రంలో ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో అడ్మిషన్లు పెరిగాయి. ముఖ్యంగా ఫీవర్ ఆసుపత్రి లాంటి హాస్పిటల్స్ లో ఫ్లూ లక్షణాలతో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఫ్లూ కేసుల్లో దేశంలో 5వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం.

Also Read..H3N2 Influenza Virus : మళ్లీ మాస్క్ తప్పదా? కరోనా కంటే వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న కొత్త వైరస్, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరస్ ల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింది. అధిక సంఖ్యలో జనం ఆస్పత్రుల్లో చేరడానికి ఈ వైరస్ కారణమవుతుందని ఐసీఎమ్ఆర్ తెలిపింది. ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభం కావడంతో ఈ వైరస్ ఇన్ ఫెక్షన్ల సంఖ్య మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి తగ్గే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అంటోంది.

Also Read..Brain Eating Amoeba : మెదడును తినేసే అమీబా..! మరో వ్యక్తి మృతి..ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన

ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ముఖ్యంగా పెద్దవారు, చిన్నపిల్లలు జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఇది రెగ్యులర్ గా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణమని గుర్తించారు. దీన్ని హెచ్3ఎన్2 అనే వేరియంట్ గా ఐసీఎమ్ఆర్ గుర్తించింది. దీని ప్రభావంతో ఎక్కువ శాతం మంది దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యల బారినపడుతున్నారని డాక్టర్లు వెల్లడించారు.