Haleem: హైదరాబాద్‌లో పెరిగిన హలీం ఆర్డర్లు

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్డర్ అనాలసిస్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది హైదరాబాద్‌లో హలీం ఆర్డర్లు 33 రెట్లు పెరిగాయట. దీంతోపాటు హైదరాబాదీలు చికెన్ బిర్యానీ కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారట.

Haleem: హైదరాబాద్‌లో పెరిగిన హలీం ఆర్డర్లు

Haleem

Haleem: రంజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హలీం స్పాట్‌లే కనిపిస్తాయి. బిర్యానీతోపాటు హలీంను కూడా హైదరాబాదీలు అంత ఇష్టంగా తింటారు. ఈసారి కూడా హలీం ఎక్కువగా అమ్ముడవుతోందట. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్డర్ అనాలసిస్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది హైదరాబాద్‌లో హలీం ఆర్డర్లు 33 రెట్లు పెరిగాయట. దీంతోపాటు హైదరాబాదీలు చికెన్ బిర్యానీ కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారట. రంజాన్ మాసం మొదటి 20 రోజుల్లో ఎనిమిది లక్షల బిర్యానీలు అమ్ముడైనట్లు స్విగ్గీ తెలిపింది.

Food Crisis : భవిష్యత్‌లో తినడానికి తిండి కూడా దొరకదట.. వ్యవసాయ భూములు ఉండవట..!

హలీం, బిర్యానీతోపాటు నిహారిస్, సమోసా, రబ్డి, మాల్పువా వంటివి కూడా భారీగా ఆర్డర్ చేస్తున్నారట. నిహారిస్ ఆర్డర్లు కూడా గతేడాదితో పోలిస్తే 30 రెట్లు పెరిగాయని స్విగ్గీ చెప్పింది. సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు హైదరాబాదీలు. ఇఫ్తార్ స్నాక్స్ అయిన సమోసా, భజియా, రబ్డి, ఫిర్ని వంటివి కూడా సాయంత్రాలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యే దాదాపు 4.5 లక్షల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.