ఫేక్ అకౌంట్లతో వేధింపులు..సూర్యాపేటలో ఇద్దరు అరెస్టు

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 09:36 AM IST
ఫేక్ అకౌంట్లతో వేధింపులు..సూర్యాపేటలో ఇద్దరు అరెస్టు

Harassment with fake accounts : సోషల్ మీడియాలో వేధింపులు అధికమౌతున్నాయి. ఫేక్ అకౌంట్స్ (fake accounts) సృష్టించి..అమ్మాయిలను, వివాహిత మహిళలను వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే వేధిస్తున్న ఇద్దరిని సూర్యపేట పోలీసులు అరెస్టు చేశారు. నూతనకల్ కి చెందిన పెద్దింటి కిరణ్ కుమార్ రెడ్డికి పెళ్లి కాలేదు. ఇతను మద్యానికి బానిసయ్యాడు.



facebook, Instagram, whatsapp మెంటేన్ చేసేవాడు. వాట్సప్ లో ఉన్న అమ్మాయిల ఫొటోలను డౌన్ లోడ్ చేసుకొనే వాడు. వీరి పేరిట నకిలీ ఖాతాలను తెరుస్తాడు. ఆమె ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లు పంపించి..వారితో ఛాటింగ్ చేస్తుండేవాడు. కొద్ది రోజుల తర్వాత…అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలను పంపిస్తాడు.



అవతలి వ్యక్తులు నిలదీస్తే..పోలీసులకు దొరక్కుండా..ఆధారాలు మాయం చేస్తాడు. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన వివాహితను ఇలాగే వేధించాడు. దీంతో ఆమె నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ మోహన్ రావు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై కన్నేసి సూర్యాపేటలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.



మరొక ఘటనలో…
అమ్మాయిలను మానసికంగా వేధిస్తున్న టేకుల ఫణీందర్ రెడ్డిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిది కూడా సూర్యాపేట (Suryapet) జిల్లా. యార్కారానికి చెందిన ఫణీందర్ రెడ్డి..క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులను పికప్, డ్రాపింగ్ చేసేవాడు. మంచితనంగా మెలిగేవాడు.



మంచి వ్యక్తిగా భావించి..మహిళా ఉద్యోగులు ఫంక్షన్ లకు పిలిచేవారు. కలిసి ఫొటోలు దిగేవారు. అనంతరం..వక్రబుద్ధిని బయటపెట్టేవాడు. అమ్మాయిలతో తాను కాస్త దగ్గరగా ఉన్న ఫొటోలను వారికి పంపించి..డబ్బులు డిమాండ్ చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో అతడిని సూర్యాపేటలో అరెస్టు చేశారు.